కరోనా సంక్షోభంలో సినీ కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం. నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు. ఇక నిర్మాతలైతే.. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేని సిట్యుయేషన్. నటీనటులు ఇన్ కమ్ ఆగిపోయింది. ఆల్ రెడీ కమిటైన సినిమాల పారితోషికాల్లో కోత పడుతోంది. ఇంతటి భయంకరమైన సిట్యుయేషన్ లో సంపాదిస్తున్న హీరో ఒకే ఒక్కడునున్నాడు.
కరోనా హాలిడేస్ లో మహేశ్ పిల్లలతో సరదాగా గడిపేస్తాడు అనుకుంటున్నారు. ఇది ఆయనలో ఒక షేడ్ మాత్రమే. మరో యాంగిల్ లో కోట్లు సంపాదిస్తున్నాడు. కరోనా టైమ్ లో షూటింగ్స్ లేవు. కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. ఇంకా కోట్లు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారా.. యాడ్స్ రూపంలో సంపాదిస్తున్నాడు సూపర్ స్టార్.
కరోనా టైమ్ లో మహేశ్ బాబు, రిలయన్స్ సంస్థ మధ్య బిగ్ డీల్ కుదిరిందట. జియో నెట్ వర్క్ తన షేర్ ను విదేశీ సంస్థకు అమ్మిన విషయం తెలిసిందే. జియో నెట్ వ్క్ ను పల్లెల్లోకి విస్తారంగా తీసుకెళ్లేందుకు మహేశ్ తో యాడ్స్ ఒప్పందం జరిగిందట. ఈ డీల్ ఫ్యాన్సీ అమౌంట్ తీసుకొచ్చిందని సమాచారం.
తెలుగులో ఏ హీరోకూ లేనన్ని యాడ్స్ మహేశ్ సొంతం. మహేశ్ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. పవర్ స్టార్ మొదటి నుంచీ యాడ్స్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రభాస్ కు ఆలిండియా క్రేజ్ ఉన్నా.. యాడ్స్ తక్కువే. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేశ్.. వీటి ద్వారా సంపాదించిన మొత్తాన్ని చిల్డ్రన్ వెల్ఫేర్ కు ఖర్చుపెడతాడు. ఈ క్రమంలో వెయ్యికి పైగా గుండె ఆపరేషన్స్ చేయించాడు మహేశ్. యాడ్స్ రూపంలో ఎంత ఎక్కువ సంపాదిస్తే.. అంత ఎక్కువ మంచి జరుగుతుందన్న మాట.
మొత్తానికి సైలెంట్ గా ఉన్నట్టే కనిపిస్తున్న మహేశ్ బాబు తన పని చేసుకుంటూ పోతున్నాడు. పిల్లలతో ఆడుతూ.. పాడటమే కాదు.. కొన్ని యాడ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాలు దక్కించుకొని కోట్లు గడిస్తున్నాడు. ఇలాంటి విపత్కర సమయాల్లో కూడా భారీ సొమ్మును కైవసం చేసుకుంటున్నాడు. అంతేకాదు మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నాడు. యాడ్స్ లో వచ్చిన సొమ్మును సామాజిక సేవకూ వినియోగిస్తూ నిజంగా శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మహేశ్ బాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి