ఆ సినిమా కోలీవుడ్ లోమంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే సినిమా ని చిరు కోసం మెహర్ రమేష్ కొన్ని మార్పులు, చేర్పులు చేసి తీస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న వేదాళం తెలుగు రీమేక్ లో సాయిపల్లవి, చిరంజీవి సోదరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు మెహెర్ రమేష్ సాయి పల్లవి ని సంప్రదించారని టాక్. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆచార్య షూటింగ్ ముగిసిన అనంతరం పట్టాలెక్కనుంది.
ఐతే ఈ సినిమా విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రానప్పటికీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని విషెస్ తెలియజేసిన మెహెర్ రమేష్ కి దన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్, ఈ సినిమా గురించి ప్రస్తావించడంతో అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు.ఇక సాయి పల్లవి ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ బిజీగా వుంది. తెలుగులో నాగచైతన్య సరసన లవ్ స్టొరీ, రానా సరసన విరాట పర్వం, మరియు తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. మరి ఇప్పుడు మెగాస్టార్ సినిమా లో కనుక ఈ అమ్మడు నటిస్తే ఈమెకు పెద్ద బ్రేక్ రావడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి