టీజర్, ట్రైలర్లో ఉన్న సస్పెన్స్ సినిమాలో ఏమాత్రం లేదని ప్రేక్షకులు తేల్చేసారు. ఇక అనుష్క పాత్ర అయితే ఆమె అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. రెండేళ్ల తరువాత ఇలాంటి ప్లాప్ సినిమాతో అనుష్క ప్రేక్షకులను పలకరించిందేంటి అనే కామెంట్స్ కూడా వినిపించాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘నిశ్శబ్దం’ చిత్రం రిజల్ట్ తరువాత దర్శకుడు హేమంత్ మధుకర్ కు ఏ హీరో అయినా ఛాన్స్ ఇస్తాడా? అనే డిస్కషన్లు కూడా నడిచాయి.
అంతకు ముందు ఈ దర్శకుడు ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా తీసాడు. అది కూడా ఫ్లాపే..! అంతేకాదు ‘ఏ ఫ్లాట్’, ‘ముంబై 125 KM’ అనే హిందీ చిత్రాలు కూడా చేసాడు. అవి కూడా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో ఈ దర్శకుడిని నమ్మి హీరోలు ఛాన్స్ ఇస్తారని చెప్పలేము. అయితే ఓ క్రేజీ హీరో ఇతన్ని నమ్మి తరువాతి సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడట. ఆ హీరో మరెవరో కాదు మన మాధవన్. ‘నిశ్శబ్దం’ చిత్రంలో ఇతను కూడా నటించాడు. హేమంత్ పనితనం నచ్చి.. అతనితో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పాడట. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఆ ప్రాజెక్టుని మాధవనే నిర్మించబోతున్నాడట.మాధవన్ ఛాన్స్ ఇవ్వటం తో ఈ డైరెక్టర్ ఫుల్ హ్యాపీ గా వున్నాడట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి