టాలీవుడ్ లో కొంతమంది హీరోలు దాదాపు టాప్ హీరోలను ఢీ కొడుతూ స్టార్ స్టేటస్ అందిపుచ్చుకుంటారా అనిపిస్తుంటుంది. వారి చిత్రాల విషయంలో జరిగే బిజినెస్ కూడా అలాగే ఉంటుంది. అనుకోకుండా వచ్చిన కొన్ని కలెక్షన్ వండర్స్.. ఆయా హీరోలపై మనకు ఆ తరహా ఒపీనియన్ ను క్రియేట్ చేస్తుంటుంది. ఒకటి రెండు ఫ్లాప్ లు పడప్పుడు కూడా బిజినెస్ ,వసూళ్లు ఆ స్థాయికి కొంత తక్కువలో ఉన్నప్పటికీ .. ఆ హీరోని స్టార్ హీరోగా ట్రీట్ చేయాల్సిందే. కానీ విజయ్ దేవరకొండ మ్యాటర్ లో లేనిపోని కన్ఫ్యూజన్లు మార్కెట్ లో చాలానే జరిగాయి. తాజా లెక్కల ప్రకారం విజయ్ దేవరకొండ కూడా 25కోట్ల హీరోగానే లెక్క తేలాడు.
యంగ్ హీరో నిఖిల్ కూడా ఆ మధ్య కొంత హడావిడి చేశాడు. ఈ కుర్రహీరో ఎన్ని చేసినా తన ర్యాంక్, మార్కెట్ ఎంతనే దానిపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడో క్లారిటీకి వచ్చేశాడు. ఒకటి రెండు చిత్రాలు గట్టిగానే వసూళ్లు సాధించినప్పటికీ ..ఫైనల్ గా తన మార్కెట్ 20నుంచి 25కోట్లవరకు ఉందని ఓ అండర్ స్టాండ్ కు వచ్చాడు. ఇంతకుమించిన లెక్క తేవాలన్నా.. కంటెంట్, దర్శకుడు ,ప్రొడక్షన్ హౌస్ అన్నీ కలిసిరావాలనే సూక్ష్మాన్ని తెలుసుకున్నాడు.
శ్రీవిష్ణు. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ప్రయోగాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నారా రోహిత్ తో కలిసి శ్రీవిష్ణు చేస్తున్న సినిమాలు ఫ్లాప్ లైనప్పటికీ మార్కెట్లో నోటెడ్ చిత్రాలుగానే మిగులుతున్నాయి. ఎక్కడా కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ అనే మాట కనిపించడం లేదు. బహుశా అదే శ్రీవిష్ణుని టాలీవుడ్ లో యునీక్ హీరోగా నిలబెట్టింది. జస్ట్ 4నుంచి 7కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఇతని చిత్రాలు 20కోట్ల మేర బిజినెస్ చేయడం మెచ్చుకోదగిన విషయమే. కాకపోతే శ్రీవిష్ణు సెలెక్ట్ చేసుకునే కథలు బాగున్నప్పటికీ.. సినిమాలు ఎందుకు అన్ని వర్గాల వరకు చేరడం లేదనే విషయంలో మాత్రమే.. కన్ఫ్యూజన్ అనే మాట హైలెట్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి