ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన తమన్నా భాటియా తన ఆరోగ్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నగరానికి చేరుకున్న తమన్నా భాటియా కి కరోనా లక్షణాలు తలెత్తడంతో ఆమె ఒక ప్రైవేట్ ఆస్పత్రి లో చేరారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన తమన్నా భాటియా కరోనా నుండి పూర్తిగా కోలుకొని ముంబై లోని తన ఇంటికి చేరుకున్నారు. అయితే మొదట్లో తనకు కరోనా సోకింది అని తెలియగానే చాలా ఆందోళన చెందానని తమన్నా భాటియా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.


"కరోనా సోకిన సమయంలో నా ఆరోగ్యం బాగా క్షీణించింది. కాంటినెంటల్ హైదరాబాద్ హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు నాకు మెరుగైన కరోనా వైద్యం అందించారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా భయాన్ని బలహీనతను పోగొట్టి కరోనా వ్యాధిని నయం చేసిన డాక్టర్లకు నేను ఎప్పటికి రుణపడి ఉంటాను," అని తమన్నా భాటియా చెప్పుకొచ్చారు. గతంలో తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. కానీ కొన్ని రోజుల్లోనే వారిద్దరూ కూడా కరోనా నుండి కోలుకున్నారు.


ఇకపోతే తమన్నా చివరి సారిగా ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఒక ఐటమ్ పాటలో కనిపించారు. ఆమె ఇప్పుడు దట్ ఈజ్ మహాలక్ష్మి, సిటీ మార్, హిందీ చిత్రం బోలే చుడియన్ చిత్రాల్లో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. కన్నడ పరిశ్రమలో భారీ హిట్ అయిన ఈ రొమాంటిక్ చిత్రం తెలుగులో రీమేక్ గా రావడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిటీ మార్ సినిమాలో తమన్నా భాటియా సరసన గోపీచంద్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: