బిగ్ బాస్ హౌజ్ లో పులిహోర బ్యాచ్ కే ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుందా.. ఎలాంటి రిలేషన్ పెట్టుకోకుండా హౌజ్ లో ఆట ఆడాలని ప్రౌయత్నిస్తే ఆడియెన్స్ కు నచ్చదా.. ఆడియెన్స్ కు నచ్చినా బిగ్ బాస్ వారి ఓట్లని కూడా పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చిన హౌజ్ మేట్ ను ఎలిమినేట్ చేస్తారా. ఇంతకీ ఏంటిది అంటే ఈవార్మ్ ఎలిమినేట్ అయిన కుమార్ సాయి ఎలిమినేషన్ పై ఆడియెన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. మోనాల్ ను సేవ్ చేస్తూ లాస్ట్ మినిట్ లో కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు.

అయితే అలా మోనాల్ కన్ఫెషన్ రూమ్ లో నుండి తిరిగి హౌజ్ లోకి రాగానే అఖిల్ ఓ డీప్ హగ్ ఇచ్చేశాడు. ఆమె వెళ్తే పులిహోర కలపడం ఎలా అనుకున్నాడో ఏమో బాగా అప్సెట్ అయ్యాడు అఖిల్. మనోడికి ఆట మీద కన్నా మోనాల్ మీద ఎక్కువ దృష్టి ఉంది. మోనాల్ సేఫ్ అని తెలియగానే అఖిల్ ఆమెకు రెండు మూడు డీప్ హగ్గులు ఇచ్చాడు. వీళ్ళ అతి చూడలేక ఆడియెన్స్ తలలు పట్టుకుంటున్నారు. బాబోయ్ బిగ్ బాస్ ఏంటయ్యా మాకీ తలనొప్పి అనుకునేలా అఖిల్, మోనాల్ ల ఓవరాక్షన్ ఉంది.

వారి పులిహోర కార్యక్రమం బయటకి వచ్చాక చూసుకోవచ్చు. వారు ఉన్నది బిగ్ బాస్ హౌజ్ లో అక్కడకు వచ్చింది గేమ్ ఆడటానికి అన్న విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు వీరిద్దరు. అసలు మోనాల్ కు హౌజ్ లో ఉండే అర్హత లేదని కొందరు ఓపెన్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. బిగ్ బాస్ కుమార్ సాయిని ఉంచి మోనాల్ ను ఎలిమినేట్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మోనాల్ ఈ వారం సేవ్ అయినా నెక్స్ట్ వీక్ ఆమె ఎలిమినేట్ అవడం మాత్రం పక్కా అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: