చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్ ఒకరు. ఒకప్పటి నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్ బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించి గీతాంజలి అనే మలయాళ సినిమాతో 2013లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు. తెలుగులో అయినా ఇష్టం నువ్వు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమా నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉండే ఆమె తాజాగా పుట్టినరోజు జరుపుకుంది.

ఈమె తెరపై ఎంత పద్దతిగా కనిపిస్తుందో నిజ జీవితంలోనూ అంతే ఉంటుంది. అందుకే ఇప్పటి దాకా కీర్తి సురేష్‌పై ఎలాంటి గాసిప్, రూమర్లు వంటివి రాలేదు. క్లీన్ ఇమేజ్‌తో కీర్తి దూసుకెళ్తోంది. గ్లామరస్ రోల్స్ క్ కూడా ఆమె ఆమడ దూరంలో ఉంటుంది. అలాంటి కీర్తి సురేష్ తాజాగా అనిరుధ్ తో చనువుగా ఉన్న పిక్స్ బయటకి రావడం సంచలనంగా మారింది. ఈ ఫోటోలు కీర్తి సురేష్ షేర్ చేయడం సంచలనంగా మారింది.

ఈ ఫోటోల్లో కీర్తిపై అనిరుధ్ చేతులు వేసి దగ్గరగా హత్తుకుని ఉండడంతో ఇద్దరి మధ్య అంత చనువుందా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరో పక్క ఫ్యాన్స్ ఏమో టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అనిరుధ్ ఆండ్రియాతో చేసిన రాసలీలల రచ్చ ఇంకా మరిచిపోలేదు కదా. ఇక పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కు హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: