సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ చేయబోయే 3డి మూవీ ‘ఆది పురుష్’ గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి రోజుకో కొత్త అప్‌డేట్ వస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు కానీ ప్రచారాలు మాత్రం గట్టిగా జరుగుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్ ఈ చిత్రంలో శివ పాత్రను పోషిస్తారని గతంలో చర్చ జరిగింది.

రావణుడిగా సైఫ్ పేరు ప్రకటించిన తరువాత, ఓం రౌత్ తన గత సినిమా ‘తన్హాజీ - ది అన్సంగ్ వారియర్’ లో ప్రధాన నటుడు అజయ్ దేవ్‌గన్‌ కూడా ఆది పురుష్ సినిమాలో మళ్ళీ నటించనున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం మేరకు అజయ్ ‘ఆది పురుష్’ సినిమాలో ఆయన నటించడం లేదని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి.

 సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమాకి ఆయన ఇంకా 10 రోజుల షూట్ చేయాల్సి ఉంది.  అలానే ఆయన డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల చేయాల్సి ఉన్న ‘భుజ్-ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ షూట్‌లను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన ‘మైదాన్’ సినిమా క్సొఅ పెద్ద షెడ్యూల్ లో షూట్ చేయాలి. ఇవే కాకుండా ఆయన తన బ్యానర్‌లో తీస్తున్న సినిమాలపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అందుకే ఆయన ఈ సినిమా చేయడం లేదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: