బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా నడుస్తోంది. ఈ షో నెమ్మదిగా ఏడవ వారానికి కూడా చేరింది. ఈ షోకి నాగార్జున ప్రస్తుతం హోస్ట్ గా ఉండగా ఆయన బాగానే నడిపిస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన్ని ఎలా తప్పిస్తారు ? అనే అనుమానం కలగడం సహజం. అయితే ఆయన్ని పూర్తిగా తప్పించడంలేదు. అందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. అసలు విషయానికి వస్తే హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం   వైల్డ్ డాగ్ అనే కాప్ బేస్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన వేరొక ప్రాంతానికి వెళ్తున్నారట.  

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని భిన్న త‌ర‌హా పాత్ర‌ను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ ని నిర్దాక్షిణంగా వేటాడే ఆయనని సినిమాలో వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయన బిగ్ బాస్ కార్యక్రమానికి దూరమవ్వడం అనివార్యం అయ్యిందని అంటున్నారు. ఈ సమయంలో నాగార్జున స్థానంలో ఎవరో ఒక కొత్త సెలబ్రిటీ హోస్టింగ్ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే ఇలా షోలో అడుగుపెట్టగానే ఎలిమినేషన్ వంటి ప్రక్రియను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది.

అప్పటి కప్పుడు తాత్కాలికంగా షోలో హోస్ట్ గా బాధ్యతలు చేపట్టి ఎలిమినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం అంటే ఎవరికైనా కష్టమే. అయితే లాస్ట్ యియర్ కూడా ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు రమ్యకృష్ణని ఎంటర్ చేసి ఆ వారానికి నామినేషన్స్ నిలిపి వేశారు. ఈ వీక్ కూడా సేం సీన్ రిపీట్ అయ్యే చాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. ఈ వారం నాగార్జున కోడలు సమంత అక్కినేని బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తోందని అంటున్నారు. అయితే ఇది ఎంత వరకూ నిజం అనేది శనివారం వరకూ ఆగితే కానీ తేలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: