ధియేటర్స్ ఓపెన్ అయినా జనం క్రితంలా వస్తారా రారా అన్న విషయం తెలియకపోవడంతో ప్రస్తుతానికి ధియేటర్స్ ఓపెనింగ్ విషయాన్ని వచ్చే నెలలో రాబోతున్న దీపావళి వరకు వాయిదా వేసారు. దీనితో చాలామంది ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు అతుక్కుపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు కూడ ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కన్నేశారు.


ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా మొదలుపెట్టి ఈ ప్లాట్ ఫామ్ కు మరింత క్రేజ్ పెరగడానికి వందల కోట్లల్లో పెట్టుబడి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ పారిశ్రామిక వేత్త మ్యాట్రిక్స్ ప్రసాద్ కలిసి ఆహా లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు.  ఇప్పుడు ఈ రేస్ లోకి అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.



అయితే ఆహా తరహాలో ఓటీటీ ని ప్రారంభించకపోయినా ప్రముఖ జాతీయ ఓటీటీల తో టైఅప్ లు పెట్టుకుని కథ నడిపించేందుకు నాగ్ మాష్టర్ స్కెచ్ వేసినట్లు టాక్. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ టీవీ సీరియళ్లతో పాటు ఓటీటీ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఆహా కోసం కూడా కొంత కంటెంట్ ను అన్నపూర్ణా స్టూడియోస్ ఇస్తోంది అన్న ప్రచారం ఉంది.


ఇలాంటి పరిస్థితులలో అన్నపూర్ణ స్టూడియోస్ కు  జాతీయ స్థాయిలో పేరున్న ఓటీటీ నుంచి ఒక తెలుగు వెబ్ సిరీస్ కోసం కాస్టింగ్ కాల్ పిలుపు అందింది. 11 నుంచి 55 ఏళ్ల వరకూ ఏజ్ గ్రూప్ ఉన్న ప్రతిభావంతులైన ఆర్టిస్టులు కావాలి అంటూ కాల్ ఇచ్చారు. దీనితో నాగార్జున కన్ను ఓటీటీ బిజినెస్ పై పడింది అన్న స్పష్టమైన క్లారిటీ వస్తోంది. నాగార్జున కేవలం టాప్ హీరోగా రాణించడమే కాకుండా అనేక వ్యాపారాలలో కొనసాగుతూ అనేక విజయాలు సాధిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో నాగ్ ఇప్పుడు ఓటీటీ బిజినెస్ లోకి కూడ ఎంటర్ అయితే ఓటీటీ ప్రేక్షకులకు మంచి వెబ్ సిరీస్ లు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: