హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని పుకార్లు చెలరేగడంతో కుటుంబ సభ్యులు కూడా వెంటనే స్పందించారు. అటు వైద్యులు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ లో ప్రస్తుతం రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

రాజశేఖర్ ఆరోగ్యం విషమంగా ఉందని గురువారం వదంతులు రావడంతో ఆయన కుటుంబ సబ్యులు స్పందించి అవి తప్పుడు వార్తలని తేల్చి చెప్పారు. మరోవైపు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ రత్న కిశోర్ కూడా పుకార్లను వ్యాప్తి చేయొద్దని చెబుతూ ఎప్పటికప్పుడు ఆస్పత్రి తరపున మెడికల్ బులిటెన్ విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వెంటిలేటర్‌ సహాయం లేకుండానే రాజశేఖర్‌ చికిత్సకి స్పందిస్తున్నారని మెడికల్‌ డైరెక్టర్‌ రత్నకిశోర్‌ తెలిపారు

వారం రోజుల కిందట రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. రాజశేఖర్ భార్య జీవితతో పాటు ఆయన కుమార్తెలు శివానీ, శివాత్మిక కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. భార్య, పిల్లలు కోలుకున్నంత త్వరగా ఆయన రికవర్ కాలేకపోయారు. మొదటినుంచీ కరోనాపై పూర్తి అవగాహన ఉన్న రాజశేఖర్ కుటుంబం లాక్ డౌన్ టైమ్ లో ఎక్కడికీ వెళ్లలేదు. పూర్తి జాగ్రత్తలు తీసుకున్నా కూడా కుటుంబం మొత్తం కరోనా బారిన పడటం ఆందోళన కలిగించింది. అయితే జీవిత, పిల్లలు.. వెంటనే కరోనానుంచి పూర్తిగా కోలుకున్నారు. రాజశేఖర్ మాత్రం ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వెంటిలేటర్ పై పెట్టే పరిస్థితి వచ్చిందంటే.. పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్ట అనుకోవాలి. అయితే వైద్యులు మాత్రం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులంటున్నారు. మరో రెండురోజుల తర్వాత కానీ రాజశేఖర్ ఆరోగ్యంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: