ఎందుకో కానీ ఈ మధ్య కొత్త హీరోయిన్స్ వెంట పడుతున్నారు. అంటే కొత్త హీరోయిన్స్ అనుకునేరు.. కాదు, ఇప్పటిదాకా నటించని హీరోయిన్స్ తో నటించడం అన్నమాట. అంటే ఒకరకంగా హీరోయిన్ కాంబినేషన్ కూడా ఫ్రెష్ గా ఉండాలనుకుంటున్నారు. అందుకే సినిమాకో హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి చూస్తున్నారు మన హీరోలు. మన హీరోల్లో జూ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ భారీ సినిమాలకే ప్రియారిటీ ఇస్తుంటాడు. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో ఇలాగే భారీ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. మన్యం వీరుడు కొమరం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ తో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ జోడీ కడుతోంది.

అలానే ఎక్కువగా హిట్ కాంబినేషన్స్ ని రిపీట్ చేసే రామ్ చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ కోసం మార్కెట్ లెక్కలని ఫాలో అవుతున్నాడు. పాన్ ఇండియన్ మూవీకి సెట్ అయ్యేలా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తో నటిస్స్తున్నాడు. ప్రభాస్ కూడా ఎప్పుడూ ఆన్ స్క్రీన్ రోమాన్స్ కోసం ఫ్రెష్ కాంబినేషన్స్ కే ఓటేస్తాడు. రాధేశ్యామ్ కి కూడా ఇదే ఫార్మాట్ ని ఫాలో అవుతున్నాడు ప్రభాస్.

వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా హీరోయిన్స్ ని రిపీట్ చెయ్యడానికి అస్సలు ఇష్టపడడు. పుష్పలో కూడా అందుకే ఫ్రెష్ కాంబినేషన్ ని తీసుకున్నాడు. రష్మిక మందన్నతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇక స్టార్ హీరోలే కాదు, యంగ్ స్టర్స్ కూడా హీరోయిన్లని రిపీట్ చెయ్యట్లేదు. ఒకసారి స్టెప్పులేసిన హీరోయిన్ తో మళ్లీ జంట కట్టడానికి రెడీ అవ్వడం లేదు. సినిమా సినిమాకి జానర్ మార్చినట్టు, హీరోయిన్లని కూడా మార్చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: