ప్రస్తుతం సోషల్ మీడియా రాజ్యమేలుతున్న సమయంలో సినిమా డైరెక్టర్ ఎలాంటి షాట్స్ కాపీ కొట్టినా యిట్టె తెలిసిపోతుంది.. ఇప్పటికే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ లను తెగ ట్రోల్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.. థమన్, దేవిశ్రీప్రసాద్ ల ట్యూన్ లో కొంచెం కాపీ అనిపించినా విపరీతంగా ఆడేసుకుంటారు.. ఇక దర్శకుల విషయానికొస్తే గతంలో ఇంటర్నెట్ అందుబాటులో లేని టైం లో అయితే వారేం చేసిన చెల్లుబాటు అయ్యింది కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకు దొరికిపోతున్నారు..

ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి ప్రభాస్ లుక్ ఒకటి రిలీజ్ కాగా ఆ లుక్ పై ఎలా ట్రోల్ జరిగిందో అందరికి తెలిసిందే.. ఇటీవలే ‘రాధేశ్యామ్’కు సంబంధించిన ఒక పోస్టర్లో చూపించిన వింటేజ్ ట్రైన్ దృశ్యం కూడా కాపీ అని దానికెంతగా మేకప్ చేసినా సరే.. నెటిజన్లు కనిపెట్టేశారు. తాజాగా కొమురం భీం టీజర్ విషయంలో కూడా ప్రేక్షకులు జక్కన్న చేసిన ఓ కాపీ పేస్ట్ పనిని గుర్తించారు..

కొమరం భీమ్ ఓ గిరిజన తెగకు చెందిన వాడన్న సంగతి తెలిసిందే. ఆయన జీవితంలో ఎక్కువ భాగం అటవీ ప్రాంత నేపథ్యంలోనే సాగింది. టీజర్లో ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ అడవులకు సంబంధించిన విజువల్సే తీసుకున్నారు. ఐతే టీజర్లో ఒక చోట చూపించిన దట్టమైన అడవి మధ్యలో సూర్య బింబం విజువల్.. అలాగే వర్షంలో నీటి బిందువుల విజువల్.. ఇంకా అగ్నిపర్వతాన్ని చూపించిన దృశ్యం.. ఇవన్నీ కూడా రాజమౌళి టీం షూట్ చేసినవి కావు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌కు చెందిన ఒక వీడియో నుంచి అగ్నిపర్వతం విజువల్ తీసుకోగా.. ఇంకో రెండు చోట్ల నుంచి అడవి, నీటి బిందువల దృశ్యాలు తీసుకున్నారు. కరోనా టైం లో జక్కన్న టైం లేక అభిమానుల వత్తిడి తో అవి షూట్ చేయలేదని అందుకే తీసుకోవాల్సి వచ్చిందని కొంతమంది అభిమానులు రాజమౌళి కి సప్పోర్ట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: