బిగ్ బాస్ 4 లో ఈ వారం కెప్టెన్ గా ఎవరవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. 50 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌజ్ లో ప్రతి టాస్క్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. ఇక ఈ క్రమంలో కెప్టెన్సీ అనేది కూడా నామినేషన్స్ లో లేకుండా చేస్తుంది కాబట్టి తప్పకుండా కెప్టెన్సీ టాస్క్ కోసం టఫ్ ఫైట్ చేయాల్సి ఉంటుంది.

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌజ్ మేట్స్ మధ్య ఓ టాస్క్ పెట్టాడు. ఓ టెబుల్ మీద కీ ఉంచి హౌజ్ మేట్స్ అందరిని దాని చుట్టూ పెట్టాడు. అయితే బజర్ మోగగానే దాన్ని ఎవరు పట్టుకుంటారో వారికి ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో అఖిల్ ఆ కీని తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే చెట్టు మీద ప్రతి హౌజ్ మేట్ ఫోటో కలిగి ఉన్న యాపిల్ ఉంటుంది. దాన్ని కారణాలు చెప్పి బ్రేక్ చేయాలని చెప్పినట్టు ఉన్నాడు. అయితే దాన్ని మాత్రం మోనాల్ చేయడం జరుగుతుంది.

మరి ఈ వారం కెప్టెన్ గా ఎవరు అవుతారి. అఖిల్ మోనాల్ కోసం కెప్టెన్సీ త్యాగం చేస్తాడా.. మోనాల్ కెప్టెన్ అవుతుందా.. అఖిల్ ఆటని ఎలా తీసుకెళ్ళాడు. బిగ్ బాస్ సీజన్ 4లో తర్వాత కెప్టెన్ ఎవరు అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలిసే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఆటని రసవత్తరంగా మార్చడంలో బిగ్ బాస్ టీం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. ఓ పక్క ఐపిఎల్ నడుస్తున్నా సరే బిగ్ బాస్ ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ సక్సెస్ సాధిస్తుంది.                                                



మరింత సమాచారం తెలుసుకోండి: