ఒకప్పుడు మన టాలీవుడ్ లో లవ్ స్టోరీలకు తరుణ్ కేరాఫ్ అడ్రస్ గా ఉండేవాడు. అతని సినిమాలు యూత్ పై తన ప్రభావం చూపేవి. ఆయన అరంగేట్రం చేసిన తొలి సినిమా నువ్వే కావాలి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలా కొన్నాళ్ల పాటుగా తన హవా కొనసాగించి యూత్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన ఈ హీరో తర్వాత అలా ఫేడ్ అవుట్ అయ్యిపోయాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఆ తర్వాత అరకొర సినిమాలు చేసాడు కానీ అతని సినిమాలు వచ్చినట్టు కూడా ప్రజలకు తెలియదు.

అయితే ఇటీవలే తాను నటించిన సెన్సేషనల్ హిట్ “నువ్వే కావాలి” చిత్రం 20 వసంతాలు పూర్తి చేసుకోవడంతో ఆ జ్ఞపకాలను గుర్తు చేస్తూ మళ్ళీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తరుణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.అయితే నటన పరంగా రోల్స్ మారడం కాదు సినీ ఇండస్ట్రీలోనే నిర్మాతగా మారాలని తరుణ్ అనుకుంటున్నాడని తాజా సమాచారం అం. ఇప్పుడు మూడు ప్రాజెక్టులను టేకప్ చేసాడట. వాటిలో రెండు ఓటిటికి ప్లాన్ చేస్తుండగా మరొకటి సినిమాకు అన్నట్టు తెలుస్తుంది. 

మరి ఈ రకంగా అయినా తరుణ్ మంచి కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. మరి తరుణ్ నిర్మాతగా ఏ రేంజ్ లో అలరిస్తాడో మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఎందరో సైడ్ అవుట్ అయిపోయిన హీరోల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులను కమెడియన్స్ గాను విలన్స్ గాను ఇండస్ట్రీలో స్థిరపడ్డారు అయితే  తరుణ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ ఉండడంతో ఆసక్తికరంగా మారింది .ఎందరో యువ హీరోలు నిర్మాణ రంగంలో ఉన్నారు నితిన్ తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు అలాగే తను కూడా నిర్మాణ రంగంలో ఎంతవరకు రాణించగలడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: