ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన "7/జి బృందావన కాలానీ" సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సోనియా అగర్వాల్. ఈ సినిమాలో రవి కృష్ణ హీరోగా నటించాడు. ఈ సినిమాలో సోనియా హొట్నెస్ తో పాటు నటన పరంగా కూడా ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సెల్వా రాఘవన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది సోనియా. తరువాత కొన్ని వ్యక్తిగత కారణాలా వలన వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. తరువాత సోనియా ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఒక చిన్న రోల్ లో కనిపించింది.తరువాత సినిమా అవకాశాల కోసం ట్రై చేసిన ఫలితం లేకుండా పోయింది.






దీంతో ఈ హాట్ బ్యూటీ రూటు మార్చేసి తన లుక్‌పై ఫోకస్ పెట్టిందని తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తుంటే స్పష్టంగా అర్ధమవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ  ఫొటోలో ఉన్న సోనియాను చూస్తే ఆమె రూపం పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది. నాజూగ్గా మారిన సోనియాని చూసి అంతా షాకవుతున్నారు. ఏంటి.. సోనియా అగర్వాల్ ఇలా మారిపోయిందేంటి? ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సూపర్ మేడం.. ఇక మళ్ళీ మీకు హీరోయిన్ ఛాన్స్ పక్కా అంటున్నారు ఇంకొందరు. చూడాలి మరి సోనియా ప్రయోగం ఎంతవరకు విజయవంతం అవుతుందనేది...! ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: