జబర్దస్త్ షోతో చాలామంది సూపర్ క్లిక్ అయ్యారు. కొందరు బుల్లితెర మీదే ఫిక్స్ అవగా మరికొంతమంది మాత్రం సిల్వర్ స్క్రీన్ పై కూడా తమ సత్తా చాటుతున్నారు. వారిలో సుడిగాలి సుధీర్ ఆల్రెడీ హీరోగా మారగా లేటెస్ట్ గా అదే టీం లో బెస్ట్ కమెడియన్, ఆల్రౌండర్ అయిన గెటప్ శ్రీను కూడా హీరోగా మారుతున్నాడు. అతను హీరోగా రాజు యాదవ్ సినిమా వస్తుంది. కృష్ణమాచారి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి.

జబర్దస్త్ లో 10 నిమిషాల స్కిట్ లో తన నట విశ్వరూపం చూపిస్తాడు గెటప్ శ్రీను. ఆటో రాం ప్రసాద్ రాసే స్కిట్ కన్నా దాన్ని గెటప్ శ్రీను ఇంప్రవైజ్ చేసే విధానం బాగుంటుంది. అతను ఏ పాత్ర వేసినా సరే సూపర్ హిట్. అంతేకాదు పాత్రకు 100కి 100శాతం న్యాయం చేస్తాడు. అందుకే గెటప్ శ్రీనుని బుల్లితెర కమల్ హాసన్ అని అంటారు.

అతను హీరోగా వస్తున్న రాజు యాదవ్ కామెడీ ప్రధానంగా వస్తుంది. సుడిగాలి సుధీర్ ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. అయితే అతను మూడవ సినిమా ఈమధ్యనే మొదలైంది. జబర్దస్త్ స్కిట్ కోసమే రకరకాల వేషధారణతో మెప్పించే గెట్ప్ శ్రీను హీరోగా సినిమా అంటే నట విశ్వరూపం చూపిస్తాడని చెప్పొచ్చు. నీది నాది ఒకే కథ, విరాటపర్వం డైరక్టర్ వేణు ఊడుగుల దగ్గర అసోషియేట్ గా పనిచేసిన కృష్ణమాచారి డైరక్షన్ లో గెటప్ శ్రీను మొదటి సినిమా వస్తుంది.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: