మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కి డిజాస్టర్స్ కొత్తేమీ కాదు. ఆరెంజ్ సినిమా మొదలు తుఫాన్, గోవిందుడు, అందరివాడేలే లాంటి సినిమాలు ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చి పెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో సంక్రాంతికి రిలీజ్ చేసిన వినయ విధేయ రామ సినిమా మరో ఎత్తు. ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ చేసిన ఈ సినిమా రామ్ చరణ్ కి పెద్ద దెబ్బ వేసింది. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం తెచ్చి పెట్టిందనే చెప్పాలి. 

అయితే అనూహ్యంగా ఈ సినిమా ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా రికార్డు స్థాయిలో టి ఆర్ పి లు రావడం ఆశ్చర్యకరంగా మారింది. హిట్ అయిన సినిమాలు కూడా టెలీకాస్ట్ అయినప్పుడు మంచి రేటింగ్స్ తెచ్చుకోలేక పోయాయి. రికార్డు స్థాయిలో ఇలా టెలికాస్ట్ చేసిన ప్రతిసారీ మంచి రేటింగ్ తెచ్చుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదు. కానీ రామ్ చరణ్ కి మాత్రం ఎప్పుడు టెలీకాస్ట్ చేసినా ఈ సినిమాకి మంచి రేటింగ్స్ రావడం గమనార్హం. 

తాజాగా దీన్ని 15వ సారి స్టార్ మా వాళ్లు టెలికాస్ట్ చేశారు. అప్పుడు కూడా ఈ సినిమా రికార్డు రేంజ్ లో 5.4 రేటింగ్ సంపాదించింది. మొత్తంగా 14వ సారి వచ్చిన రేటింగ్ కంటే ఇది కొంచెం తగ్గినా సరే 15వ సారి మళ్లీ పుంజుకుంది. టెలికాస్ట్ అయిన ప్రతిసారీ ఇంత అద్భుతమైన రేటింగ్ తెచ్చుకుంటూ టెలివిజన్లో ఈ సినిమా రికార్డు సృష్టించింది అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా ఈ సినిమా టెలివిజన్ లో మాత్రం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ రికార్డు స్థాయి రేటింగ్ తెచ్చుకుంటుంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: