బిగ్ బాస్ సీజన్ 4లో ఆల్రెడీ ఇప్పటికే 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. అందుకే ఇక మీదట హౌజ్ నుండి బయటకు రావడమే కాని వెళ్లేది లేదని అనుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం కరోనా టైం కాబట్టి ఒక్కసారి బయటకు వచ్చిన వారు మళ్లీ హౌజ్ లోకి వెళ్లాలంటే మళ్లీ 15 రోజులు క్వారెంటైన్ లో ఉండాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 4 16 మంది కంటెస్టంట్స్ లో మొదలవగా ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది.

అయితే లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4లో మరో ఎంట్రీ ఉండబోతుందని అంటున్నారు. అది కూడా సీజన్ 4 ఇంటి సభ్యుడు తిరిగి మరళ హౌజ్ లోకి వస్తున్నట్టు చెబుతున్నారు. ఇంతకీ హౌజ్ లో రీ ఎంట్రీ ఇచ్చే కంటెస్టంట్ ఎవరు అంటే అతను నోయెల్ అని అంటున్నారు. సీజన్ 4 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న నోయెల్ తన లెగ్ పెయిన్ తో హౌజ్ నుండి బయటకు వచ్చాడు.

ట్రీట్ మెంట్ జరిగిన తర్వాత మరళ తిరిగి హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 11వ వారం హౌజ్ నుండి లాస్య ఎలిమినేట్ అవుతుండగా ఆమె ప్లేస్ లో నోయెల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. లాస్య ఎలిమినేషనే పెద్ద షాక్ అనిపించేలా ఉంటుంది. అలాంటిది నోయెల్ రీ ఎంట్రీ కూడా ఆడియెన్స్ కు డబుల్ కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. మరి నోయెల్ రీ ఎంట్రీపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: