మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే..శృతిహాసన్ కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా కి గోపీచంద్ మలినేని దర్శకుడు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకుని పూర్తిచేసుకున్న ఈ సినిమా కి ముందు రవితేజ సినిమాలు దాదాపు ఆరు  ఫ్లాప్ అయ్యాయి.. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని తనకు అచ్చిచ్చిన డైరెక్టర్ తో చేతులు కలిపాడు.. ఇదే డైరెక్టర్ తో గతంలో డాన్ శ్రీను, బలుపు చిత్రలుచేసి హిట్ కొట్టాడు రవితేజ.. ఇప్పుడు క్రాక్ తో హ్యాట్రిక్ కి సిద్ధంగా ఉన్నాడు.

అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ఎంతో నమ్మకంతో చేసిన డిస్కో రాజ కూడా ఫ్లాప్ కావడంతో రవితేజ కి క్రాక్ సినిమా మస్ట్ నీడెడ్ హిట్ సినిమా అయ్యింది.. ఇక ఈ సినిమా తరువాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వీర సినిమా తో దర్శకుడిగా రవితేజ సినిమా చేసినా ఆ సినిమా హిట్ గా నిలవలేదు.. మరి ఈ సినిమా ఎం చేస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే డైరెక్టర్ మారుతీ ఇటీవలే రవితేజ కి ఓ కథ చెప్పి ఒప్పించినా సంగతి తెలిసిందే. అయితే మారుతీ రవితేజ కి, ఈ సినిమా నిర్మాతలకు సంధి కుదుర్చలేకపోయారట..నిర్మాణ సంస్థ యూవీ , రవితేజ లు ఇద్దరు డైరక్టర్ మారుతి చెప్పిన సబ్జెక్ట్ ను ఓకే చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో డేట్ లు ఇస్తా అన్నారు. అంతవరకు బాగానే వుంది. కానీ రెమ్యూనిరేషన్ మాట్లాడాల్సింది నిర్మాతలు. ఈ సినిమాకు నిర్మాతలు అయిన బన్నీవాస్-యూవీ వంశీ. ఇప్పుడు రెమ్యునరేషన్ ని ఫైనల్ చేయాలేదు. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా విడుదల వరకు ఆగుదాం. సినిమా హిట్ అయితే మరి కాస్త డిమాండ్ చేయచ్చు అని హీరో వైపు నుంచి ఆలోచనగా వుంది. అదే ఆలోచన రివర్స్ లో వుంది యువి వైపు నుంచి. క్రాక్ సినిమా రిజల్ట్ బాగుంటే ఒకె. లేదూ అంటే కాస్త బేరం ఆడొచ్చు అన్నది యువి ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి: