అక్కినేని కాంపౌండ్ లో ముగ్గురు హీరోలు ఉన్నారు. నాగార్జున స్వీట్ సిక్స్టీలో కూడా నాటౌట్ అంటూ దూసుకుపోతున్నారు. ఓ వైపు వైల్డ్ డాగ్ షూటింగ్, మరో వైపు బిగ్ బాస్ హోస్టింగ్ ఇలా రెండింటినీ చక్కగా  మ్యానేజ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు నాగ్. అందునా కరోనా టైం. అయినా అందరి కంటే  ముందు షూటింగులకు వచ్చి నాగ్ తన డేరింగ్ ని రుజువు చేసుకున్నాడు.

ఇక డిసెంబర్ తో బిగ్ బాస్ షో కంప్లీట్ అవుతోంది. దాంతో నాగ్ వరసపెట్టి సినిమాలు చేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు. నాగ్ సోగ్గాడే చిన్ని నాయన అదిరిపోయే సూపర్ హిట్ అయింది. 2016 సంక్రాంతికి రిలీజ్ అయి ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులో పంచెకట్టుతో నాగార్జున నటన సూపర్ అని ఫ్యాన్స్ అంతా అన్నారు. ఆ తరువాత దానికి సీక్వెల్ చేస్తామని నాగ్ ప్రకటించినా అది ఇప్పటివరకూ కుదరలేదు.

ఇపుడు దానికి టైం వచ్చేసిందిట. బంగార్రాజు పేరు మీద తీస్తున్న ఈ సీక్వెల్ లో నాగ్ తో పాటు నాగ చైతన్య కూడా నటిస్తాడు అంటున్నారు. ఈ సీక్వెల్ కి చక్కని స్క్రిప్ట్ ని సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ తయారు చేశారుట. దాంతో ఈ మూవీలో నాగ్, చైతూ రమ్యక్రిష్ణ నటిస్తారని అంటున్నారు. డిసెంబర్ తో మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ తో ఫినిష్ చేస్తారని అంటున్నారు. ఇలా పెద్ద కొడుకుతో నాగ్ స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తోంది.

ఇక అఖిల్ నాగార్జున తో మల్టీ స్టారర్ మూవీ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇద్దరి కొడుకులతో నాగ్ వరసగా సినిమాలు చేయడం ఫ్యాన్స్ కి చాలా హ్యాపీ అని చెప్పాల్సిందే.2021 అక్కినేని నామ సంవత్సరం అని అపుడే ఫ్యాన్స్ హుషారెత్తిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: