కొన్ని నెలల క్రితం, తరుణ్ భాస్కర్ హార్స్ రైడింగ్ ఒక కథను వెంకటేష్ కు వినిపించాడు. ఆ సమయంలో ఈ సినిమా కథను వెంకటేష్ ఫైనల్ చేశారని అన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అటక ఎక్కినట్టే అని అంటున్నారు. ఎందుకంటే వెంకటేష్సినిమా చేసేందుకు సిద్దంగా లేరట. తాజా నివేదికల ప్రకారం ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నిలిపివేయబడిందని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నడుపుతున్న సురేష్ బాబు తరుణ్ భాస్కర్ ల మధ్య సృజనాత్మక తేడాలు అదేనండీ క్రియేటివ్ డిఫరెన్స్ లు రావడంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం లేదని అంటున్నారు.

సురేష్ బాబు ఈ సినిమ కథ మరియు స్క్రీన్ ప్లేతో మితి మీరిన సంబంధం పెంచుకున్నాడని ఆహ్డే తరుణ్ భాస్కర్ కి నచ్చలేదని అంటున్నారు. అనుకున్నట్లుగా పనులు జరగకపోవడంతో, తరుణ్ మరియు సురేష్ బాబు ఇద్దరూ ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.  షూట్ ప్రారంభమైన తర్వాత వెంకటేష్ నటించిన ప్రాజెక్ట్ నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు.

ఇంతకుముందు, కిషోర్ తిరుమల, తేజ, మరియు పూరి జగన్నాధ్ కూడా వెంకటేష్ ప్రధాన పాత్రలో తమ ప్రాజెక్టులు మొదలు పెట్టాక కూడా తప్పుకున్నారు. సురేష్ బాబు యొక్క స్థిరమైన ఇన్ పుట్ లు క్రియేటివ్ ఫీల్డ్  వైపు ఆయనకు ఉన్న ఆసక్తి సినిమా దర్శకులను చికాకు పెడుతున్నట్లు కనిపిస్తుంది. తత్ఫలితంగా, బహుళ ప్రాజెక్టులు నిలిపివేయబడుతున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ ఏమీ తక్కువ తినలేదు ఆయన ఒక పెద్ద స్టార్ నటించిన క్రైమ్ డ్రామాకు దర్శకత్వం వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: