ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....దీపావళి కానుకగా  సూర్య నటించిన  ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా విడుదలై  బ్లాక్ బస్టర్  టాక్ సొంతం చేసుకుంది. సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మాస్టర్ పీస్  అన్ని రకాల  ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ప్లాఫుల్లో ఉన్న సూర్యకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ద్వారా విడుదలైన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ అని క్రిటిక్స్ తేల్చేశారు. ఈ ఊపులోనే సూర్య వరుసబెట్టి కొత్త సినిమాలు చేసేస్తున్నాడు. పాండిరాజ్‌, వెట్రిమారన్ వంటి క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సూర్య .. తాజాగా హరి సినిమా గురించి కూడా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


సూర్య సినిమాలలో "యముడు" సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలుసు. సూర్య కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమాలివి. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా సూర్య కనబర్చిన విశ్వరూపం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ మూడు సినిమాకు దర్శకత్వం వహించింది హరి. వీరి కాంబినేషన్లోనే ‘ఆరు’ అనే సినిమా కూడా వచ్చింది. దీంతో హిట్ పెయిర్‌గా ఈ జోడీకి మంచి డిమాండ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్లు చాలాకాలం క్రితమే ప్రకటన వెలువడింది. అయితే ఈ మధ్యలో చోటుచేసుకున్న పరిణామాలతో సూర్య, హరి మధ్య దూరం పెరిగిందని, ఈ సినిమా ఆగిపోయిందంటూ కోలీవుడ్‌‌లో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన సూర్య ఆ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.


ఇక రీసెంట్ బ్లాక్ బస్టర్  ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తర్వాత హరితో సినిమా చేయనున్నట్లు సూర్య గతంలోనే ప్రకటించారు. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సూర్య తన సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌కి భారీ ధరకు అమ్మేశారు. దీంతో సూర్యపై థియేటర్ల సంఘం మండిపడింది. ఇకపై సూర్య సినిమాలు థియేటర్లలో ప్రదర్శించబోమని, ఆయన నిర్ణయం తమ ఉపాధిని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఈ విషయంలో దర్శకుడు హరి కూడా సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయిని, దీంతో సినిమా ఆగిపోయిందటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను సూర్య కొట్టి పారేశాడు. ‘హరి సర్ తో చేసేది భారీ బడ్జెట్ సినిమా.. అందుకే ఆలస్యవుతోంది. స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: