బిగ్ బాస్ సీజన్ 3లో విజేతగా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. తెలుగులో పాప్ సింగింగ్ కల్చర్ తీసుకురావాలనే ఆలోచనతో సింగర్ గా సినిమాల్లో పాడుతూనే ప్రైవేట్ ఆల్బంస్ చేస్తున్నాడు రాహుల్. బిగ్ బాస్ సీజన్ 3లో ఆడియెన్స్ మనసులు గెలవడమే కాకుండా టైటిల్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం తన ప్రైవేట్ సాంగ్ బేబీకి పెట్టాడు రాహుల్.

బిగ్ బాస్ తర్వాత సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ బేబీ కోసం దాదాపు 58 లక్షల దాకా కర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బేబీ సాంగ్ ను చేశాడు రాహుల్. అయితే అది ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. బేబీ కోసం బిగ్ బాస్ లో వచ్చిన ప్రైజ్ మనీ అంతా పెట్టేశాడు రాహుల్ అయినా కూడా అది సరైన రేంజ్ లో క్లిక్ అవలేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో అతను నోయెల్ కు సపోర్ట్ చేయడం.. అతని యాంటీ ఫ్యాన్స్ రాహుల్ సాంగ్ కు నెగటివ్ ట్రోల్స్ చేయడం జరిగిందని అన్నారు.

ఏది ఏమైనా రాహుల్ బేబీ అంచనాలను అందకపోయినా రాహుల్ ఫ్యాన్స్ కు మాత్రం అది మంచి జోష్ ఇస్తుందని అంటున్నారు. ఓ పక్క సినిమాలకు పాడుతూనే రాహుల్ ఇలా ప్రైవేట్ సాంగ్స్ తో శ్రోతలను అలరిస్తున్నాడు. సింగర్ గా తన టాలెంట్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు రాహుల్. రాహుల్ బేబీ సాంగ్ ఇదివరకు తన సాంగ్స్ తెచ్చుకున్న వ్యూస్ రాబట్టడంలో వెనకపడ్డది. రాహుల్ తన నెల్స్ట్ ప్రాజెక్ట్ కు ఇంకాస్త ఫోకస్ తో పనిచేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: