అనీల్ రావిపుడి డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సినిమా 2019 సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఆ టైం లో వచ్చిన క్రేజీ సినిమాల దాటికి నిలబడి మరి ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లోనే ఎఫ్-3 ఉంటుందని చెప్పాడు అనీల్ రావిపుడి అనుకున్నట్టుగానే ఎఫ్-3 షురూ అవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడట అనీల్ రావిపుడి. ఇక నేడో రేపో సెట్స్ మీదకు వెళ్లడమే అనుకుంటే టైం లో మెగా హీరో వరుణ్ తేజ్ చిత్రయూనిట్ కు షాక్ ఇచ్చాడట.

ఎఫ్-2తో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో గద్దలకొండ గణేష్ సినిమాతో కూడా సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఎన్నో వివాదాల మధ్య రిలీజైన ఆ సినిమా రేపు రిలీజ్ అనగా టైటిల్ చేంజ్ చేసి వచ్చినా సినిమా హిట్ చేశారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ కిరణ్ డైరక్షన్ లో బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎఫ్-3 ఉంటుందని తెలుస్తుంది. అయితేం ఎఫ్-3 కోసం వరుణ్ తేజ్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట.

వరుస హిట్లు పడుతుండటంతో వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. బాక్సర్ కూడా హిట్ అయితే మాత్రం వరుణ్ తేజ్ మరింత రెమ్యునరేషన్ పెంచే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. ఫైనల్ గా మెగా ప్రిన్స్ ఎఫ్-3లో నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎఫ్-3లో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా రవితేజ కూడా ఉంటాడని అని వార్తలు రాగా వాటిల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: