రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాం చరణ్.. కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఇద్దరు ఫ్రీడం ఫైటర్స్ కథతో ఫిక్షన్ స్టోరీగా ట్రిపుల్ ఆర్ వస్తుంది. ఈ సినిమాకు కావాల్సిన భారీ హంగులను జతచేస్తున్నాడు జక్కన్న.

సినిమాను భారీ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో బాలీవుడ్ నుండి ఇప్పటికే అజయ్ దేవగన్ ను సినిమాలో భాగం చేశాడు. అయితే మరోపక్క సినిమా ప్రమోషన్ కోసం మరో బిగ్ స్టార్ ఆమీర్ ఖాన్ ను వాడుతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ పాత్రలను పరిచయం చేసే వాయిస్ ఓవర్ ఆమీర్ ఖాన్ ఇస్తారట. హిందీలో ఆమీర్ ఖాన్ ఇస్తున్న ఈ వాయిస్ ఓవర్ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేత ఇప్పిస్తున్నారని తెలుస్తుంది.

రాజమౌళి అడగ్గానే చిరు కూడా తప్పకుండా వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్పారట. అలా ఆర్.ఆర్.ఆర్ లో చిరు కూడా భాగం అవుతున్నారు. రాం చరణ్ తో రాజమౌళి చేసిన మగధీర సినిమాలో కూడా చిరు స్పెషల్ సర్ ప్రైజ్ తెలిసిందే. అలానే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కోసం కూడా కనిపించకపోయినా వినిపించేందుకు సిద్ధమయ్యారు. చిరు వాయిస్ తో రాం చరణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. మెగా ఫ్యాన్స్ కు తప్పకుండా ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని చెప్పడంలొ ఎలాంటి సందేహం లేదు.                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: