బిగ్ బాస్ సీజన్ 4లో శనివారం ఎపిసోడ్ నాగార్జున ఇద్దరు హౌజ్ మేట్స్ మీద తన ఫోకస్ అంతా పెట్టినట్టు తెలుస్తుంది. ముందు బెస్ట్ కెప్టెన్ హారికని కన్ ఫెషన్ రూం కు పిలిచి నువ్వు మోనాల్ వల్ల కెప్టెన్ అయ్యావు.. అభిజిత్ కు ఫేవర్ గా కెప్టెన్సీ వాడుకున్నావు అంటూ నాగ్ ఫైర్ అయ్యాడు. ఆమెకు మూడు క్లిప్పింగ్స్ చూపించి మరి హారిక నువ్వేం చేస్తున్నావో తెలుసా అని మరి చెప్పి పంపించాడు. నువ్వు మంచిగా ఆడుతున్నావు కాని నీ ఆట నువ్వు ఆడు అంటూ చెప్పాడు నాగ్.

ఇక నెక్స్ట్ హౌజ్ లో అందరి ముందు అభిజిత్ ను ఆటాడుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయకుండా స్కిప్ చేసినందుకు నాగ్ సీరియస్ అయ్యాడు. గేటు తీయించి ఒకవేళ దీనికి నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం హౌజ్ నుండి బయటకు పంపించేసేవాడినని వార్నింగ్ ఇచ్చాడు. ఉన్న ఈ మూడు వారాలు గట్టిగా ఆడండని మీరంతా సూపర్ సెవన్ అని అన్నారు నాగార్జున.

అయితే నామినేషన్స్ లో ఉన్న నలుగురిలో ముందు మోనాల్ ను సేఫ్ చేసి షాక్ ఇచ్చాడు నాగ్. ఈ వారం నో ఎలిమినేషన్ అనే వార్తలను నిజం చేసేలా మోనాల్ ను సేఫ్ చేసి అరియానా, అవినాష్, అఖిల్ ల మధ్య ఎలిమినేషన్ టాస్క్ ఉంచాడు. అవినాష్ కు ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల అతను ఎలాగైనా సేఫ్ అవుతాడు ఉన్నదల్లా అఖిల్, అరియానాలలో ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: