సినీ పరిశ్రమలోని వ్యక్తులు సోషల్ మీడియాలో ఆల్ మోస్ట్ యాక్టివ్ గానే ఉంటారు.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానులకు మరింత దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్లో కొందరు ప్రముఖుల పై పెద్ద విధ్వంసమే జరిగింది... దాంతో మిగిలిన నటీనటులు కూడా సోషల్ మీడియా జోలికి పోకుండా దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే మెరిసి మాయం అవుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మార్చిన సోషల్ మీడియాలో డిపి తో మళ్లీ బాలీవుడ్లో సోషల్ మీడియా హవా మొదలైనట్లు అనిపిస్తోంది.

ఇటీవలే దీపికా పదుకొనే తన సోషల్ మీడియాలో  ప్రొఫైల్ ఫోటోను మార్చడంతో విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ అది తన ప్రియ నటుడు రణబీర్ కపూర్ తో దిగిన ఫోటో కావడంతో మరింత ఉత్కంఠ నెలకొంది.వారిద్దరూ నటించిన తమాషా చిత్రం ఇటీవల 5 సంవత్సరాలను పూర్తి చేసుకోగా... ఆ తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రొఫైల్ ని మార్చారు దీపిక. అంతేకాదు ఆ చిత్రంలో దీపిక పాత్ర పేరు తార కావడంతో... ప్రొఫైల్లో తన పేరును కూడా తారగా చేంజ్ చేసింది.

కాగా ఈ ఫోటోలు చూసిన వారందరూ పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. గతంలో రణబీర్ కపూర్ దీపికా పదుకొనే లు ఓ రేంజ్ లో రిలేషన్ నడిపిన సంగతి తెలిసిన విషయమే. అంతేకాదు రణబీర్ పేరును తన మెడపై టాటూగా కూడా వేయించుకున్నారు దీపు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా వీరిద్దరు దూరమయ్యారు .. కానీ ఇప్పటికీ మంచి స్నేహితులుగానే మెలుగుతున్నారు... కాగా రణబీర్ బ్రేకప్  అనంతరం దీపిక  రణవీర్ ప్రేమలో పడటం... పెళ్లితో ఒకటవడం కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్లిద్దరూ వారి పర్సనల్ లైఫ్ లో ఎంతో ఆనందంగా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: