ప్రస్తుతం టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు అల్లు అర్జున్. మెల్ల మెల్లగా తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. గత 5 సంవత్సరాల నుండి బన్నీ క్రేజ్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. బన్నీకి ఒక్క తెలుగులోనే కాకుండా కేరళలో కూడా అక్కడి స్టార్ హీరోలకు ఏమాత్రం అం తీసిపోని ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు బన్నీ తన మార్కెట్ ను ఇండియా వైడ్ గా విస్తరించే పనిలో ఉన్నాడు. తనకు ఆర్య ఆర్య 2, వంటి గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే లీకైన నా ఫోటోలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఆ తర్వాతి సినిమాను బ్లాక్ బాస్టర్ దర్శకుడు కొరటాల శివ తో చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో బన్నీ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడని సమాచారం. ఒకటి కాలేజ్ స్టూడెంట్ పాత్ర కాగా రెండవది పొలిటికల్ పాత్ర అని తెలుస్తుంది.

అయితే  ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేక ఒకే పాత్రలో రెండు షేడ్స్ చూపించబోతున్నాడా.. అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను అధికారికంగా విడుదల చేసింది చిత్ర యూనిట్ ఇందులో అల్లు అర్జున్, డైరెక్టర్ కొరటాల శివ దూరంగా ఉన్నా పల్లెటూరి ని చూస్తూ నిలబడి ఉంటారు దీన్ని బట్టి  పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని అని చెప్పకనే చెప్పింది చిత్ర బృందం. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. మరి రాబోయే ఈ  సినిమాలతో అల్లు అర్జున్ ఏం ఎలాంటి  సంచలనాలు సృష్టిస్తాడు చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: