యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈమధ్యనే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లారు. అయితే ఆ టూర్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేశారు కూడాను.. అయితే మరోసారి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎన్.టి.ఆర్ దర్శనమిచ్చాడు. ఎయిర్ పోర్ట్ లో ఎన్.టి.ఆర్ సింపుల్ లుక్ చూసి తన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఎన్.టి.ఆర్ ఎక్కడికి వెళ్లొస్తున్నాడు అన్నది తెలియలేదు కాని స్టార్ హీరో స్టైలిష్ ఎన్.టి.ఆర్ లుక్ చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు తారక్. ఈమధ్యనే వచ్చిన కొమరం భీం టీజర్ రికార్డులు సృష్టిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. త్రివిక్రం సినిమా తర్వాత కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ తో ఎలాగు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చుకునే ఎన్.టి.ఆర్ ఇక మీదట తన ప్రతి సినిమా నేషనల్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. తప్పకుండా ఎన్.టి.ఆర్ బాలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బాలీవుడ్ లో ప్రభాస్ తన సత్తా చాటుతుండగా తారక్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు.                                                                               



మరింత సమాచారం తెలుసుకోండి: