హీరో సుమన్..మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి తో సమానం గా టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమాలు విడుదల చేసిన స్టార్ నటుడు. అందగాడు ఆరడగుల ఆజానుబాహుడు. అప్పట్లో సుమన్ కి మంచి లేడీ ఫాలోయింగ్ ఉండేది. ఎంతో క్రేజ్ ఉన్న సమయంలో అమాంతం పాతాళానికి పడిపోయాడు. ఏం తప్పు చేసాడో కూడా తెలియకుండా మూడేళ్లు జైలు పాలయ్యాడు. కేసు నమోదు కూడా చేయకుండా, కేసు ఏంటో చెప్పకుండా, బెయిల్ ఇవ్వకుండా సుమన్ ని అప్పటి పోలీస్ అధికారులు ఉంచారంటే అది మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఏదైనా చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినా కూడా అదో పెద్ద సంచలనం. కానీ అప్పట్లో మీడియా అంత పక్షపాతం గా వ్యవహరించలేదు. సుమన్ మూడేళ్లు జైలులో ఉన్న కూడా అది అప్పట్లో మాములు విషయమే అన్నట్టుగా చూసారు. కాని సినిమా ఇండస్ట్రీ లో మాత్రం పేరు ఫేడ్ అవుట్ అయ్యింది. ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అలాంటి టైం లో హీరో సుమన్ కి పెళ్లి కుదిరింది.

పెద్ద రచయిత మవరాలితో పెళ్లి

సుమన్ ని ఒక రకంగా చెప్పాలంటే అసలు ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఆల్మోస్ట్ మర్చిపోతున్న సమయంలో ఇండస్ట్రీ లో ఎంతో మంచి పేరున్న రచయిత నరసరాజు గారు తన మనవరాలి అయినా శిరీష ని ఇచ్చి సుమన్ తో పెళ్లి చేసారు. అలాంటి ఒక పెద్ద మనిషి సుమన్ ని నమ్మి తన మనవరాలిని ఇచ్చాడంటే, అతడు ఏ తప్పు చేసి ఉండడు అనే భావన మెల్లిగా సినిమా ఇండస్ట్రీ లో మొదలయ్యింది. అలా సుమన్ తన పెళ్లి ద్వారా సెకండ్ ఇనింగ్స్ ని నిలబెట్టుకోగలిగాడు. కొన్నాళ్ళు హీరో గా నటించి ఆ తర్వాత సహాయక నటుడిగా మారిపోయాడు. ఇంకా సౌత్ ఇండియన్ భాషల్లో విలన్ గా కూడా సుమన్ కి మంచి క్రేజ్ ఉంది. ఏది ఏమైనా మెగాస్టార్ లాంటి నటుడిని ఢీకొట్టిన సుమూడేళ్లు జైలులో ఉన్న కూడా సుమన్ కి పిలిచి పిల్లను ఇచ్చింది ఎవరుమన్ ఒక్క కేసు వల్ల తనకు రావాల్సిన గుర్తింపును పొందలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: