ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మనం అనుకుంటాం కాని బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంత ఈజీ కాదు.. ఆ టాస్కులు, గొడవలు బాబోయ్ మహా చిరాకు మరి వాళ్ళు ఎలా ఉంటున్నారో కాని నిజంగా చాలా గ్రేట్ అండి బాబు.. ఈ బిగ్ బాస్ ఎప్పుడు గొడవలు పెట్టడానికే టాస్కులు ఇస్తుంటాడు. ఈ సారి కూడా పెద్ద గొడవ పెట్టుకోడానికి భలే విచిత్రమైన టాస్క్ ఇచ్చాడు..అదేంటంటే గార్డెన్ ఏరియాలో ఆవు ఉంటుందట.. అది అంబా.. అంబా అని అరుస్తుండట.. అలా అరిచిన ప్రతిసారీ పాలు ఇస్తుందట.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఒకరి మీద ఒకరు పడుతూ ఆ పాలను పిండుకోవాలట. ‘టికెట్ టు ఫినాలే’ ఫస్ట్ లెవల్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన అలవాటు లేని టాస్క్ ఇది.ఈరోజు ప్రోమో విడుదల చేయగా.. ఇంటి సభ్యులు ఒకరి మీద ఒకరు పడుతూ పాలు పితకడానికి ముప్పుతిప్పలు పడుతున్నారు.ఇక అందరికంటే అవినాష్.. టికెట్ టు ఫినాలే లెవల్ టుకి వెళ్లడం కోసం తెగ కష్టపడుతున్నాడు.

ఇక టాస్కులో చూసినట్లయితే  పాలు పితుక్కుని దాచుకోవడంలో ఇంటి సభ్యులు చాలా కష్ట పడుతున్నారు.ఇక అవినాష్ అయితే పాలు పట్టుకోవడానికి ఏకంగా పెద్ద టిన్ పట్టుకుని వచ్చాడు .. కాని సొహైల్, అఖిల్‌లు అతని పాల టిన్‌ని పక్కకి లాగిపారేస్తున్నారు.దీంతో అవినాష్.. ‘బిగ్ బాస్ నాకు వద్దు.. ఎలిమినేషన్ చేసిపారదొబ్బండి’ అంటూ దండం పెట్టేశాడు. అఖిల్, సొహైల్‌లు కలిసి  గేమ్ ఆడుతుండటంతో.. అందరూ కలిసి ఒక్కటి అయిపోయారు నన్ను పాలు పట్టుకోకుండా చేస్తున్నారు అంటూ కోప్పడ్డాడు.

ఇక అఖిల్.. అందరూ కలిసి ఒకటి కాలేదు.. అర్థమైందా?? అంటూ అవినాష్ తో గొడవకి దిగాడు. అందరూ కలిసి నన్ను ఎలిమినేట్ చేసి దొబ్బండి అంటూ అవినాష్ ఆవేశంతో మాట్లాడుతుండగా .. సొహైల్ అతనికి అరటి పళ్లు ఇచ్చి కూల్ చేస్తున్నట్టుగా ప్రోమోలో కినిపిస్తుంది... ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: