యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇది బాహుబలి సినిమా రాకముందు ప్రభాస్ కి ఉన్న బిరుదు. కానీ ఇప్పుడు ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ తన ఇమేజ్ ని అమాంతం పెంచేసుకున్నాడు.అదే రేంజ్ లో తన  ఇమేజ్ ని కాపాడుకోవడానికి మన డార్లింగ్ ఇప్పుడు వరుసగా అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ డిఫరెంట్ జోనర్స్ లో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. ముందుగా 'రాధే శ్యామ్' అనే పీరియాడికల్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని హైయెస్ట్ బడ్జెట్ తో తీయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. అలానే ఇతిహాసం నేపథ్యంలో 'ఆదిపురుష్' అనే పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని టీ - సిరీస్ భూషణ్ కుమార్  నిర్మించనున్నారు.ఇక తాజాగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రకటించాడు.ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న ఈ నాలుగు సినిమాలు బడ్జెట్ మొత్తం కలిపితే దాదాపుగా 1500 కోట్ల వరకు ఉంటుంది. 'రాధే శ్యామ్' చిత్రానికి సుమారు 300 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది.

ఆ తరువాత చేస్తున్న 'ఆదిపురుష్' బడ్జెట్ 500 కోట్ల పైనే అని సమ5. ఇక నాగ్ అశ్విన్ సినిమాకి 450 కోట్లకు పైన బడ్జెట్ అని ఆల్రేడీ ప్రకటించేశారు నిర్మాతలు. ఇప్పుడు 'సలార్' సినిమాకు కూడా ఇంతే రేంజ్ లో బడ్జెట్ ఉండబోతుందని తెలుస్తోంది. అంటే ఈ నాలుగు సినిమాల బిజినెస్ కూడా దాదాపు 2500 కోట్లు పైనే జరగొచ్చు. దీని బట్టి చూస్తే ఇండియాలో ఇంత రేంజ్ లో బిజినెస్ అలానే బడ్జెట్ మార్కెట్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను వచ్చే ఏడాది లో విడుదల చేయనున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: