సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లతో ప్రేక్షకుల ఆదరణ పొంది...కింగ్ నాగార్జున హోస్ట్‌గా 2020 సెప్టెంబరు 6న సాయంత్రం 6 గంటలకు మొదలైన వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 నిన్నటితో ముగిసింది. 15 వారాల పాటు నిర్విరామంగా కొనసాగి ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్. డిసెంబర్ 20 (ఆదివారం) నాటితో 106 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో అభిజిత్ ను విజేతగా నిలబెట్టారు ప్రేక్షకులు. ప్రేక్షకులకు ఎంతో నచ్చిన కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ... చివరికి అభిజిత్, అరియనా , సోహెల్, హారిక మరియు అఖిల్ లు గ్రాండ్ ఫినాలే కి చేరుకున్నారు.

మొన్నటి వరకు అభిజిత్ విన్నర్ గా నిలుస్తారని ప్రచారం జరగగా ఆ తర్వాత ఈసారి మహిళలకు ప్రాధాన్యమిస్తూ అరియనను గెలిపిస్తారు అంటూ ప్రచారం జరిగింది.... కానీ ఆఖరికి ప్రేక్షకులు తమ బలమైన ఓట్లతో అభిజిత్ కు పట్టం కట్టారు. టాప్ ఫైవ్ లో ఉన్న ఈ ఐదుగురు కంటెస్టెంట్ లలో సోహెల్ 25 లక్షలతో ముందుగానే తనకు తానుగా ఎలిమినేట్ కాగా... అభిజిత్ విజేతగా మిగిలిన మొత్తాన్ని గెలుచుకొని... బిగ్ బాస్ సీజన్ ఫోర్ ట్రోపీని గెలుచుకోగా... టాప్ ఫైవ్లో  మిగిలిన హారిక, అరియనా, అఖిల్ లు వట్టి చేతులతో మిగిలిన... ప్రేక్షకుల ప్రేమతో.. అభిమానుల అండతో సెలబ్రిటీగా మారి బిగ్ బాస్ హౌస్ కు గుడ్ బై చెప్పారు. గ్రాండ్ ఫినాలే లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అభిజిత్ కు విన్నింగ్ ట్రోఫీని అందించారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్ లను ప్రశంసలతో ముంచెత్తారు చిరు. అంతేకాదు సోహెల్ నేను ఒక చిన్న చిత్రం తీయాలి అనుకుంటున్నాను... అందుకు మీరు కొద్దిగా సహాయం చేయాలంటూ మెగాస్టార్ చిరును అలాగే యువసామ్రాట్ నాగార్జునను కోరగా.. అలాగే అని మాట ఇచ్చి వీలైతే ఆ సినిమాలో తనకు చిన్న పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన దాతృత్వాన్ని చాటుకున్నారు చిరంజీవి. ఇలా బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ ఎమోషన్స్ మధ్య... సంతోషాల చిరునవ్వుల మధ్య ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: