'ఉత్తమ్ సింగ్' పేరుతో పోకిరి చిత్రాన్ని రవితేజతో చేద్దామని పూరి జగన్నాధ్ అనుకున్నప్పటికీ వరుస ప్రాజెక్టులతో రవితేజ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పవన్ వద్దకు వెళ్ళి, చివరికి మహేష్ దగ్గరకు చేరి బ్లాక్ బస్టర్ అయింది. గోదావరి మూవీని రవితేజ తో చేయాలనీ శేఖర్ కమ్ముల అనుకున్నా, అతడు బిజీగా ఉండడంతో తరువాత సుమంత్ చేసాడు. కందిరీగ స్టోరీని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ముందు రవితేజకు చెప్పినప్పటికీ అతడు హోల్డ్ లో పెట్టడంతో రామ్ తో చేసి హిట్టు అందుకున్నాడు.అంతెందుకు గబ్బర్ సింగ్ మూవీని హరీష్ శంకర్ మొదట రవితేజతో చెయ్యాలనుకుంటే, పవన్ కళ్యాణ్ 'దబాంగ్' రీమేక్ రైట్స్ కొనుగోలు చెయ్యడంతో అలా వెళ్ళింది. జై లవకుశ మూవీ కథను మొదట రవితేజకు దర్శకుడు బాబీ వినిపించాడు..
గోపీచంద్ మలినేని మొదట బాడీగార్డ్ కథను రవితేజతో చెయ్యాలనుకుని, చివరికి వెంకటేష్ తో చేయాల్సి వచ్చింది. అలాగే వేణు శ్రీరామ్ మొదట ఎం.సి.ఎ చిత్రం కథను రవితేజకు చెప్పాడు. పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఎక్కడ తేడా వచ్చిందో కానీ, చివరికి నానితో చేసారు. మహా సముద్రం మూవీ మొదట రవితేజ దగ్గరకి వచ్చిన సంగతి తెలిసిందే..అంతా సెట్ చేసి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ కావడంతో అది కాస్తా చివరికి శర్వానంద్ దగ్గరికి చేరింది..సో మొత్తానికి అలా మన రవితేజ తన కెరీర్లో ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడన్నమాట...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి