రవితేజ, శ్రుతి హాసన్ జంటగా నటించిన క్రాక్ చిత్రం ఇప్పటికే రిలీజై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజైన పెద్ద సినిమా అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సంక్రాంతిని మాస్ మహారాజ్ దున్నేయనున్నాడు. మరోపక్క బుధవారం రిలీజైన మాస్టర్ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో క్రాక్ సినిమా షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా చూస్తే రవితేజ కోసమే గోపిచంద్ మలినేని ఈ చిత్ర కథను రాసి ఉంటారని అందరూ అనుకుంటారు. అంతలా రవితేజ ఈ సినిమాలో పోతురాజు వీర శంకర్ క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. అయితే ఈ సినిమా కథను డైరెక్టర్ ముందుగా చెప్పింది మాస్ మహారాజ్‌కు కాదట.

క్రాక్ సినిమా కథ ముందుగా విక్టరీ వెంకటేష్ వద్దకు వెళ్లిందంట. సినిమా కథ మొత్తం విన్న వెంకటేష్సినిమా చేసేందుకు నో అన్నారట. ఆయనను క్రాక్ స్టోరీ ఆకట్టుకోలేదని, అందుకే ఆయన ఈ సినిమాకు నో చెప్పినట్టు తెలుస్తోంది. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు కథ లేదని, స్టోరీలో చిన్న చిన్న మార్పులు చేయాలంటూ విక్టరీ వెంకటేష్ గోపిచంద్ మలినేనికి సూచించారట. అయితే మార్పులు చేసేందుకు గోపిచంద్ మలినేని ఇష్టపడకపోవడంతో వెంటనే ఈ స్టోరీని తిరిగి రవితేజకు చెప్పారట. రవితేజ ఈ కథను విన్న వెంటనే ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పేయడంతో చివరికి రవితేజ హీరోగా క్రాక్ విడుదలైంది.

ఇప్పుడు హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో వెంకటేష్ ఒక మంచి కథను మిస్ చేసుకున్నాంటూ ఆయన అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్‌లు నిజమైన క్యారెక్టర్‌లేనని చిత్ర దర్శక నిర్మాతలు ఇప్పటికే చెప్పారు. ఒంగోలు నేపథ్యంలో వచ్చే క్యారెక్టర్లు నిజ జీవితంలోని వారిని ఆధారంగా తీసుకుని గోపిచంద్ మలినేని తన కథకు తగ్గట్టు వాడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: