తమిళనాడు లో ఉండే విలక్షణ నటుల జాబితా దనుష్ ముందు వరుసలో ఉంటాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తన యాక్టింగ్ స్కిల్స్ తో పాత్రకు జీవం పోస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సూపర్ స్టార్ రజిని కాంత్  అల్లుడిగా కాకుండా తనకంటూ భారీ ఫాలోయింగ్ ను సంపాధించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 2019లో వచ్చిన "అసురన్ " సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఇతర బాషలలోకి అనువాదం కాకపోయినప్పటికి అన్నీ బాషల ప్రజలు ఈ సినిమాను తిలకించారు.

 ఈ సినిమాతో దనుష్ క్రేజ్ మరింత పెరిగింది. దాంతో దనుష్ నటిస్తున్న సినిమాలపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా దనుష్ సంక్రాంతి కానుకగా మరొక కొత్త సినిమా ను ప్రకటించాడు. ఈ సినిమాకు కూడా విలక్షణ డైరెక్టర్‌ సెల్వరాఘవన్‌ దర్శకత్వం చెయ్యబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అయిరత్తిల్‌ ఒరువన్( యుగానికి ఒక్కడు ) ‌ సీక్వెల్‌గా అయిరత్తిల్‌ ఒరువన్‌2(యుగానికి ఒక్కడు 2) ను అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే..

తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా మరొక సినిమాను కూడా ప్రకటించడంతో దనుష్ అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ప్రముఖ నిర్మాత కలైపులి థాను ఈ సినిమాను తీస్తున్నారు. "నానే వరువేన్‌" టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. టైటిల్‌ పోస్టర్‌లో కూలింగ్‌ గ్లాస్‌ ధరించారు ధనుష్‌.. తన వెనుక వేర్వేరు రకాల తుపాకులతో అదిరిపోయే లుక్‌లో ధనుష్‌ కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ మొదలైందని.. త్వరలోనే సినిమాలో నటించబోయే హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలను ప్రకటిస్తారని టాక్‌ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: