ఎఫ్ 2’, ‘వెంకీమామ’ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్.. తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన అసురన్ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండటంతో టైటిల్‌ని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.తమిళంలో ధనుష్ హీరోగా 2019లో వచ్చిన మూవీ ‘అసురన్’. సమాజంలోని కట్టుబాట్లను ప్రశ్నిస్తూ వచ్చిన చిత్రం అది. అయితే ఇక్కడ వెంక‌టేశ్ సినిమా అంటే చాలు థియేట‌ర్ల‌కు జ‌నాల తాకిడి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.  శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది.  వెంక‌టేశ్, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు . కోలీవుడ్లో సంచలన విజయం నమోదు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నారు. కలైపులి ఎస్ థాను సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


తాజాగా విడుదలైన ‘నారప్ప’ పోస్టర్స్‌లో వెంకటేష్ ఉగ్రరూపం దాల్చారు. ఊర మాస్ గెటప్‌లో వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ ప్రైజ్ చేశారు.కాగా.. సంక్రాంతి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశాడు దర్శకుడు. అయితే.. ఇందులోనూ తన ఫ్యామిలీ మార్కు ఎలివేట్ చేయడం విశేషం. తన కుటుంబ సభ్యులతో విహారయాత్రలో ఉల్లాసంగా ఉన్న నారప్ప ఫ్యామిలీ ఫొటోను చూపించిన శ్రీకాంత్.. ప్రేక్షకులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ చిత్రంలో వెంకటేష్ ప్రియమణి భార్యాభర్తలుగా నటించారు. C/o కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ పెద్ద కొడుకుగా నటించారు. నారప్ప కుటుంబంలో మరో కొడుకుతోపాటు చిన్న కుమార్తె కూడా ఉంది.

వెంక‌టేశ్, ప్రియ‌మ‌ణి ఫ్యామిలీ అంతా ఉన్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. వెంకీ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా ఇలా ఫ్యామిలీతో క‌లిసి కొత్త‌గా కనిపిస్తున్నాడు. పోస్ట‌ర్ లో కార్తీక్ ర‌త్నం స‌హా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా న‌వ్వుడం చూడొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన లుక్స్ సినిమాపై అంచ‌నాల‌ను రోజురోజుకీ పెంచేస్తున్నాయి. రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్‌రాజ్, ముర‌ళీ శ‌ర్మ‌, సంప‌త్ రాజ్‌, రాజీవ్ క‌న‌కాల ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జనవరి 22 నుంచి 3వారాల పాటు తొలి షెడ్యూల్ జరగనుంది. రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: