టాలీవుడ్ లో ఒకప్పుడు సునిల్ మంచి హాస్య నటుడిగా ఎంత బిజీగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. ఆయన కామిడీ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే హీరో గా టర్న్ తీసుకున్న తరువాత  సునిల్ కెరియర్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. " అందాల రాముడు " సినిమాతో హీరో గా మారిన సునిల్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ఆ తరువాత కమిడియన్ గా మళ్ళీ కొన్ని సినిమాలు చేసినప్పటికీ మళ్ళీ హీరో గా  రాజమౌళి దర్శకత్వంలో " మర్యాద రామన్న " సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో పూర్తి స్థాయిలో హీరోగా మరి ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆశించిన విజయాలు దక్కలేదు. మద్యలో "పూలరంగడు " వంటి హిట్ వచ్చినప్పటికి ఆ తర్వాత కూడా వరుస ఫ్లాప్ లే పలకరించాయి.

 దాంతో మళ్ళీ కామిడీ వేశాలపై ఇంట్రస్ట్ చూపించాడు. అరవిందసమేత, వంటి కొన్ని సినిమాలలో నటించాడు. అయినప్పటికి సునిల్ మునుపటిల కామిడీ చెయ్యకపోవడంతో అవకాశాలు రాలేదు. అయితే "కలర్ ఫోటో " విలన్ గా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇదిలా ఉండగా సునిల్ కు హీరోగా మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈసారి సునిల్ సరికొత్త కథతో డిటెక్టివ్‌గా మన ముందుకు రానున్నాడు. "కనబడుటలేదు" అన్న పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇందులో సునీల్ డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా నుండి పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దేనికోసం వెతుకుతున్నట్లు సునీల్ కనిపిస్తున్నాడు. అది కూడా చీకటి గదిలో టార్చిలైట్ పట్టుకొని డిటెక్టివ్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా ఈ పోస్టర్ ద్వారా సినీ టీం తెలిపుతోంది. మరి ఈ సినిమాతోనైనా సునీల్ హీరోగా ఆకట్టుకుంటాడా అనేది చూడాలి. అయితే సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఈ సినిమా పోస్టర్ పై భిన్నంగా స్పందిస్తున్నారు. " ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ " సినిమా లుక్ లో ఉందంటూ..అలాగే మళ్ళీ హీరోగా అవసరమా అంటూ నెటిజన్స్ రకరకలుగా కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: