మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో ముందు చరణ్ ఎపిసోడ్ ఒక 20 నుండి 30 నిమిషాలు అనుకోగా ఆ పాత్ర బాగా వస్తుండటం వల్ల ఆ పాత్రని 1 అవర్ దాకా పొడిగించారని తెలుస్తుంది. రెండున్నర గంటల సినిమాలో చిరు, చరణ్ ఈక్వల్ గా కనిపిస్తారని తెలుస్తుంది.

సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో చరణ్ కనిపిస్తారట మెగా ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలతో పాటుగా సినిమా కథ కూడా కొరటాల శివ మార్క్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో చరణ్ రోల్ చాలా సీరియస్ గా ఉంటుందని తెలుస్తుంది. చరణ్ పాత్రే సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

కొరటాల శివ రాం చరణ్ పాత్రని చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. చరణ్ చేసేది ఒక పాత్రే అయినా సినిమాకు అదే బలమని అంటున్నారు. అంతేకాదు ఆ పాత్రలో చరణ్ అదరగొడతారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా ఆచార్య కూడా మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుందని తెలుస్తుంది. ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నా ఆచార్య సినిమా మెగా ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.

సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. చిరు మాత్రం ఆచార్య తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా మోహన్ రాజా డైరక్షన్ లో సినిమా షురూ చేస్తున్నాడు.                             
 

మరింత సమాచారం తెలుసుకోండి: