టాలీవుడ్ ఒక ఎత్తు. భారతీయ సినిమా మరో ఎత్తు అని అంటారు. ఎందుకంటే టాలీవుడ్ స్పాన్ చిన్నది అయినా లార్జ్ స్కేల్ లో నిర్మాణాలు జరుపుతారు. ఇక బడ్జెట్ విషయంలో  అదుపూ పొదుపూ ఉండదు అని చెబుతారు. ఇక సినిమా కంటెంట్ కంటే కూడా గ్లామర్ తో పాటు కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు.

అన్నీ బాగున్న రోజుల్లో అవి హిట్ అయ్యాయి కానీ ఇపుడు కరోనా కాలం కానీ కాలం వచ్చాక సినిమా తెర చిరిగిపోయింది. మరీ ముఖ్యంగా హై బడ్జెట్ మూవీస్ కి గడ్డు రోజులే అంటున్నారు. ఎందుకంటే జనాలు థియేటర్లకు రావడం ఒక పెద్ద సమస్య అయితే కరోనా తరువాత సింగిల్ థియేటర్లు అన్నీ పెద్ద ఎత్తున మూత పడడం మరో కారణం.

ఈ నెపధ్యంలో సినిమా గతి ఏంటి అని అంతా ఆందోళన చెందుతున్న వేళ సంక్రాంతి పండుగ వచ్చింది. నిజానికి ఇది అతి పెద్ద సీజన్. టాలీవుడ్ మాత్రం జంకి బాగా వెనక్కి  తగ్గింది. దాంతో మూడంటే మూడు సినిమాలు మాత్రమే ఈ సీజన్ లో  రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో మాస్ మహారాజా రవితేజా క్రాక్ కలెక్షన్లు దుమ్ము రేపాయి. ఇప్పటికి దాదాపు పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేసిన క్రాక్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉంది. అదే విధంగా రాం రెడ్ మూవీ తొలి రోజు ఆరు కోట్లు వసూల్ చేసింది.

లాక్ డౌన్ నిబంధనలు, ఫిఫ్టీ పెర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నా కూడా ఈ రెండు సినిమాలా కలెక్షన్లు చూసిన టాలీవుడ్ షాక్ తిందని అంటున్నారు. మరో మూడు నెలలు అంటే సమ్మర్ కి తమ సినిమాలను వాయిదా వేసుకున్న పెద్ద నిర్మాతలు ఈ కలెక్షన్లకు చూసి నిజంగా పరేషన్ అవుతున్నారు. జనాలు థియేటర్లకు పెద్ద ఎత్తున  రావడమే కాకుండా సినిమాలను ఎప్పటి మాదిరిగానే ఆదరించడంతో గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నామన్న బాధ వారిలో ఉందిట. మొత్తానికి సంక్రాంతి ఇచ్చిన ఈ స్వీట్ షాక్ తో సర్దుకుని ఇక వెల్లువలా సినిమాలను రిలీజ్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి వాటి జాతకం ఎలా ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: