టాలీవుడ్ గత కొన్ని రోజులుగా మాస్ చిత్రాల జోరు తగ్గిందని చెప్పొచ్చు.. సినిమాలు తగ్గాయని చెప్పడం కంటే ఆ సినిమాలు చేసే దర్శకులు తగ్గారని అనాలి. వివివినాయక్ , బోయపాటి శ్రీను, పూరీ జగన్నాధ్ వంటి దర్శకులు ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడడంతో ఆ తరహా సినిమాలు రావడం తగ్గాయి. మాంచి మాస్ మసాలా హిట్ కి ప్రేక్షకులు మొహం వాచిపోయారు.. అలాంటి సమయంలో వచ్చిన సినిమా క్రాక్ అందరికి ఓ రిఫ్రెష్ ని ఇచ్చింది.. మాస్ రాజా రవితేజ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

సినిమా కు ముందు వరకు రవితేజ కి పెద్దగా హిట్ లు లేవు..  ఆయనతో సినిమాలు చేస్తున్న ప్రతి డైరెక్టర్ ఫ్లాప్ ను ఇస్తూ రవితేజ ఇమేజ్ ని డౌన్ చేశారు. దాంతో రవితేజ తనకు డాన్ శ్రీను, బలుపు వంటి మాస్ హిట్ లు అందించిన గోపీచంద్ కి ఛాన్స్ ఇచ్చాడు.. తన నమ్మకాన్ని నిలబెడుతూ రవితేజ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని.. థియేటర్లకు మాస్‍ ప్రేక్షకులను రాబట్టడానికి కావాల్సిన మసాలా అంశాలను దట్టించి పారేసిన గోపిచంద్‍ మలినేని ఈ విజయంతో తనకు, రవితేజకే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా హెల్ప్ చేసాడు.

ఈ విజయంతో అతడికి టాలీవుడ్‍లో డిమాండ్‍ పెరిగిపోయింది. మాస్ డైరెక్టర్ లు కనుమరుగవుతున్న వేళా అలాంటి సినిమాలు చేయాలనుకునే వారికి గోపీచంద్ మలినేని ఓ సమాధానం లా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో లు సైతం తనతో సినిమాలు చేయడానికి డేట్స్ సర్దుబాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే గోపీచంద్ తో సినిమాలు చేయడానికి ఆయనతో రాయబారాలు చేస్తున్నారు.  గోపిచంద్‍ మలినేని కనుక క్రాక్‍లాగా మరోసారి బాక్సాఫీస్‍ కిటుకుని క్రాక్‍ చేసే ఇంకో హిట్టిస్తే ఇక హీరోలు అందరూ కూడా అతడితో సినిమాకోసం రెడీ అయిపోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: