మాస్ మహరాజ్ రవితేజ ఈమధ్యనే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన క్రాక్ మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. రాజా ది గ్రేట్ తర్వాత సరైన సినిమా పడక ఫ్లాపులతో కెరియర్ సాగిస్తున్న రవితేజ క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ మాస్ యాక్షన్ ఆయన్ను ఎందుకు మాస్ మహరాజ్ అంటారో తెలిసేలా చేసింది.

సినిమా వసూళ్లతో కూడా దూసుకెళ్తుంది. క్రాక్ ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా షురూ చేశాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకునె సినిమాలో రవితేజ కెరియర్ లో మొదటిసారి ఇంటిమేట్ సీన్ కు ఓకే చెప్పినట్టు టాక్. సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరితో రవితేజ ఘాటు లిప్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన షూటింగ్ ఈమధ్యనే పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

60 సినిమాలకు పైగా చేసిన రవితేజ హీరోగా సినిమాలు చేస్తున్నా హీరోయిన్స్ తో లిప్ లాక్ లాంటివి చేయలేదు. ఖిలాడి విషయంలో మాత్రం ఆ స్టెప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రవితేజ కెరియర్ లో మొట్టమొదటిసారి హీరోయిన్ తో లిప్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. క్రాక్ హిట్ మేనియా కొనసాగించేలా ఖిలాడి కూడా ఉంటుందని తెలుస్తుంది. మీనాక్షి చౌదరితో పాటుగా ఖిలాడి సినిమాలో డింపుల్ హయతి కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: