ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మాస్ మహారాజా  రవితేజ తాజాగా నటించిన  సినిమా  ‘క్రాక్’...ఈ  సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది.పండుగ ముగిసినా కలెక్షన్ల జోరుని మాత్రం ఒక రేంజిలో కొనసాగిస్తుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. 3 ఏళ్ళ నుండీ సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ చిత్రం పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ‘డాన్‌శీను’, ‘బ‌లుపు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత `క్రాక్` చిత్రంతో రవితేజ -గోపీచంద్ లు కూడా హ్యాట్రిక్ ను కంప్లీట్ చేశారు.క్రాక్ కలెక్షన్లు చూసుకున్నట్లయితే విడుదల అయిన కొన్ని రోజుల్లోన్నే  లాభాలు రాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యింది.

ఇక ఈ సినిమా నైజాం లో 8.45 కోట్లు వసూలు చేసింది..సీడెడ్ లో 4.49 కోట్లు,ఉత్తరాంధ్ర లో 2.99 కోట్లు ఈస్ట్ లో 2.29 కోట్లు, వెస్ట్ లో 1.85 కోట్లు, కృష్ణ లో 1.72కోట్లు,గుంటూరు లో 2.03 కోట్లు,నెల్లూరులో 1.35 కోట్లు,రెస్ట్ ఆఫ్ ఇండియా 1.28 కోట్లు,ఓవర్ సీస్ 0.66 కోట్లు, టోటల్ గా 27. 11కోట్లు వసూలు చేసింది క్రాక్ సినిమా. రవి తేజ కి వరుస ప్లాపుల నుంచి మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా.. గత కొంతకాలంగా రవి తేజ పని అయిపోయింది అనుకునేవాళ్లకి ఈ సినిమా నోళ్లు మూయించిందనే చెప్పాలి...‘క్రాక్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

 9 రోజులకు గాను ఈ చిత్రం 27.11 కోట్ల షేర్ ను రాబట్టింది.50 శాతం ఆకుపెన్సీతోనే ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఇక ఈ చిత్రం కొన్న బయ్యర్స్ అంతా ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వడం విశేషం!ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు ఇప్పటివరకూ 9కోట్ల వరకూ లాభాలు పొందారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: