క్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు మలినేని గోపీచంద్.. మొదటి నుంచి గోపీచంద్ కెరీర్ ఎత్తుపల్లాలతోనే నిండి ఉంది. ఒక సినిమా హిట్ అయితే మరొక సినిమా ఫ్లాప్.. ఇలా గోపీచంద్ కెరీర్ ఇన్ని రోజులు సో సో గానే ముందుకు వెళ్ళింది.. అయితే క్రాక్ రిలీజ్ అయిన తరువాత అయన ఇమేజ్ ఇప్పుడు మాములుగా లేదు. సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అందరి హీరోల దృష్టిలో పడ్డాడు ఈ యంగ్ డైరెక్టర్.. అసలే మాస్ సినిమాలకు దర్శకులు కరువవుతున్న రోజుల్లో గోపీచంద్ తన మాస్ పనితనాన్ని క్రాక్ లో చూపించి పెద్ద పెద్ద ఛాన్స్ లు కొట్టేసేలా ఉన్నాడు.

ఈ క్రమంలో చిరంజీవి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవలే క్రాక్ సినిమా ను చూసిన చిరంజీవి దర్శకుడు గోపీచంద్ పనితనాన్ని మెచ్చుకున్నాడట. ఇంటికి పిలిపించుకుని మరీ ఈ సినిమా గురించీ, అందులోని సన్నివేశాల గురించి..  త‌న‌దైన శైలిలో విశ్లేషిస్తూ.. గోపీచంద్ ని మెచ్చుకున్నాడ‌ట‌. ఒక పెద్ద హీరో ఇలా ఓ సినిమా ని, డైరెక్టర్ ని మెచ్చుకోవడం అంటే చాల పెద్ద విషయమే.. అందులోనూ ఇప్పుడిప్పుడే స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్న ఓ డైరెక్టర్ కి ఈ ప్రశంశ మంచి బూస్టప్ ని ఇస్తుంది.. అసలే చిరు వరుసగా మాస్ సినిమా లపై దృష్టి పెట్టాడు. ఈ మాస్ హిట్ తో గోపీచంద్ కి ఓ ఛాన్స్ ఇచ్చినా ఇచ్చేయొచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు..

ఇకపోతే గోపీచంద్ క్రాక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తన తదుపరి సినిమాపై ఇంకా దృష్టి పెట్టలేదు. ఎవరితో, ఎప్పుడు చేస్తాడనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. ఒక వేళా అంతా సెట్ అయితే చిరుకి ఓ కథను వినిపించి సినిమా ను సెట్ చేసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదు. చిరు కూడా ఈమ‌ధ్య కొత్త క‌థ‌ల‌కు ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఓకే చెప్పేస్తున్నాడు. త‌న కాంపౌండ్ లోనే ఉంటున్న మెహ‌ర్ ర‌మేష్ లాంటివాళ్ల‌కే చిరు ఛాన్స్ ఇచ్చాడంటే.. గోపీచంద్ మ‌లినేని లాంటి వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంలో వింతేం ఉండ‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: