ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...వరుస ప్లాపులతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ‘చిత్ర లహరి’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి హిట్లతో సక్సెస్ బాట పట్టాడు. ఇక ఈ సుప్రీమ్ హీరో నటించిన తాజా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. కరోనా ప్రభావంతో థియేటర్లకు దూరమయ్యి.. ఓటిటిలకు అలవాటు పడిపోయిన జనాలను థియేటర్లకు రప్పించిన మొదటి సినిమా ఇది. కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు.. రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చాయి. అయినప్పటికీ ‘ఓసారి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి’ అనే కోరికను మాత్రం జనాలకు కలిగించిందనే చెప్పాలి. దానినే ఈ సినిమా క్యాష్ చేసుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక సంక్రాంతి సినిమాల హడావిడి మొదలవ్వడంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫుల్ రన్ ముగిసింది.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా అసలు హిట్ అయ్యిందా? ఎంత వసూలు చేసిందనేది చాలా మంది డౌటు. ఇక మెగా మేనల్లుడు నటించిన ఈ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రానికి రూ.9.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.12.61 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో ఫైనల్ గా ఈ చిత్రం 3.01 కోట్ల వరకూ లాభాలను బయ్యర్స్ కు అందించిందని చెప్పొచ్చు.50శాతం ఆకుపెన్సీతోనే ఈ చిత్రం ఇంత కలెక్ట్ చేసింది. ఒకవేళ 100 శాతం ఆకుపెన్సీతో కనుక థియేటర్లు రన్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం ముందుగానే పర్మిషన్ ఇచ్చి ఉంటే.. ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసుండేదనే చెప్పొచ్చు.అప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: