టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లలో అనుష్క శెట్టి ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు   వెలిగింది. దాదాపు అందరి అగ్ర హీరోల సరసన నటించింది. కానీ రాను రాను అనుష్క హవా తగ్గిందనే చెప్పాలి. గత ఏడాది మాత్రం అనుష్క కి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.ఈ మధ్య  ఓటీటీలో రిలీజ్ అయిన  ‘నిశ్శబ్దం’ సినిమా  ప్రేక్ష‌కుల‌ను పెద్దగా అలరించలేదు అనే చెప్పాలి.తరువాత అనుష్క ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఏ సినిమాలో నటించనుందో  అనే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క ‘రా రా కృష్ణ‌య్య’ సినిమాను డైరెక్ట్ చేసిన మ‌హేశ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నుంద‌ని,ఈ ప్రాజెక్ట్ లో దాదాపు అనుష్క హీరోయిన్ గా చేస్తుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధిచిన అధికారక ప్రకటన ఇంకా వెలువడలేదు.  త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అంటున్నారు.

ఇప్పుడు ఏ సినిమా చేసినాగాని అనుష్కకి  స‌క్సెస్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ మ‌ధ్య పోటీలు  పెరిగిపోయాయి. ఈ పోటీతత్వం మధ్య అనుష్క విజయాన్ని సాదించాలంటే మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కథతో, కొత్త కాన్సెప్ట్ గల చిత్రాల్లో న‌టించాలి. అంతేకాదు ముఖ్యంగా అనుష్క తన ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అనుష్క మునపటిలాగా స్లిమ్ గా లేదు. అందుకే అనుష్కని హీరోయిన్ గా చూడడానికి ప్రేక్షకులు ఇష్ట పడడం లేదు. కారణం ఏంటంటే ఆమె లావుగా ఉండ‌ట‌మే.

ఎలాగోలా  బాహుబ‌లి, భాగ‌మ‌తి చిత్రాల్లో హీరోయిన్ గా  నటించిన గాని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ నిశ్శ‌బ్దం సినిమాలో మాత్రం  అనుష్క ఫిజిక్ విషయంలో చాలా  విమ‌ర్శ‌ల‌నే ఎదుర్కొంది. దీంతో నెక్ట్స్ సినిమాకు అయినాగానీ బ‌రువు త‌గ్గాల‌నే ఆలోచ‌న‌లో  అనుష్క ఉన్నట్లు తెలుస్తుంది. బరువు తగ్గడం కోసం స్పెష‌ల్ డైట్‌, ఎక్స‌ర్‌సైజులు స్టార్ట్ చేసిందట. మామూలుగానే అనుష్క యోగా టీచర్ అవ్వడంతో  మ‌ళ్లీ పూర్వ‌పు శరీర ఆకృతి తెచ్చుకుంటుద‌నడంలో సందేహం లేదని చెప్పవచ్చు.  అయితే అనుష్క ఫిజిక్‌పై మ‌రింత ఫోకస్ పెట్టి లావు తగ్గితేనే  మ‌రిన్ని సినిమాల్లో  చేసే అవకాశం వస్తుందనడంలో  సందేహం లేదు.మళ్ళీ మన స్వీటీ పూర్వపు స్వీటీలా సెక్సీగా మారబోతుందన్నమాట.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: