స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత ఏడాది అల వైకుంఠపురం లో సినిమాతో తన కెరియర్ లోనే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ హిట్ కొట్టి దాదాపుగా 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తన సినిమాలతో పరిధిని పెంచుకుంటూ అశేషమైన అభిమానులను సంపాదించుకుంటున్నాడు. అల్లు అర్జున్ కి ఒక్క తెలుగులోనే కాక మలయాళం లో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన  హిందీ డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియెన్స్ కి కూడా సుపరిచితమే.

 యూట్యూబ్ లో ఆయన డబ్బింగ్ సినిమాలు మిలియన్ల కొద్దీ వీడియోస్ సంపాదించుకున్నాయి.  దాంతో నార్త్ లో కూడా మంచి క్రేజ్. దాంతో తన కెరియర్ లోనే మొట్టమొదటిసారిగా "పుష్ప" సినిమాతో ఫ్యాన్ ఇండియా స్థాయిలో అడుగుపెట్టబోతున్నాడు. తనతో "ఆర్య", "ఆర్య 2" వంటి చిత్రాలు తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో హ్యాట్రిక్ సినిమాను చేస్తున్నాడు. సుకుమార్ "రంగస్థలం" తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాను మేకర్స్ మొత్తం ఐదు భాషల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం మరియు హిందీ భాషల్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అనుకున్న దాని కంటే మరిన్ని భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బన్నీ సినిమాలకు మన పక్క దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది.మరి బహుశా మన దేశంలోని ఇతర భాషలతో పాటు వాటిలో కూడా విడుదల చేస్తారేమో చూడాలి. ఇక ఈ సాలిడ్ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: