తాము సంపాదించిన దాంట్లో పదిమందికి సాయపడాలన్న తపనే సేవాకార్యక్రమాల వైపు మళ్ళిస్తుంది. ఇందుకు మంచి మనసుండాలి..ఈ విషయంలో మాత్రం మన సినీ తారలు కొంతమంది తమలోని సేవా దృక్పథాన్ని చూపిస్తూ ముందుకెళ్తున్నారు.. ఇక లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ సాయం అందరికీ ఆదర్శంగా నిచ్చింది. ఇక హీరోయిన్స్ లో మహానటి సావిత్రి మొదలుకుని ఇప్పటి స్టార్ హీరోయిన్ సమంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్న హీరోయిన్స్ చాలామందే ఉన్నారు.ఇక చిరంజీవి లాంటి మెగాస్టార్ ఏకంగా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు నడుపుతూ సేవకు నిర్వచనం చెబుతూ అభిమానులను సేవవైపు మళ్లించారు. అందుకే తాము అభిమానించే నటీనటులు సేవ చేస్తుంటే, ఫాన్స్ కూడా అటే అడుగులు వేస్తున్నారు.

ఇక హీరోయిన్స్ లో బ్లూ క్రాస్ కు చెందిన అక్కినేని అమల, పెట్టాకి చెందిన త్రిష వంటి వాళ్ళు ఉన్నంతలో సాయపడుతూ ఆదర్శంగా ఉంటున్నారు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఆనంద్ సినిమాలో హీరో రాజాని తన ముద్దు ముద్దు మాటలతో ఏడిపిస్తూ, నటించిన బాలనటి భకిత బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటించకుండా దూరంగా ఉన్న భకిత ఇప్పుడు వినూత్నంగా పదిమందికి ఆదర్శంగా ఉండేలా కార్యక్రమాలు చేస్తోంది.నిజానికి టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ వంటి వాటితో గడిపేస్తున్న నేటి యువతకు ఆదర్శంగా నిలిచేలా భకిత భిన్నంగా ఆలోచించింది.

 అందుకే 17 సంవత్సరం నుండే ఓ వినూత్న పోరాటం స్టార్ట్ చేసింది. మహిళల హక్కుల కోసం, సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లకు కూడా సమన హక్కులు కల్పించాలని, ఆడవారిపై ఎలాంటి దాడులు గాని అత్యాచారాలు గాని జరక్కుండా సరైన చట్టాలను తీసుకురావాలని ఆమె పోరాటం సాగిస్తోంది. సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న తపన ఆమెను అలా అడుగులు వేయించింది. ప్రస్తుతం ఈమెకు 25 సంవత్సరాలు..ఈమె అందాన్ని చూసిన కొందరు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా.. అని చెప్తే.. తనకు ఇష్టం లేదని చెప్పేసిందట ఈ అమ్మాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: