ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్ సంక్రాంతికి రెడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత బాగా ఆడలేదు. అయితే ఇక రామ్ తదుపరి సినిమా ఏమిటి అనే దాని మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. రామ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఈ మధ్య కాలంలో గట్టిగా ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయాల్సిన మూవీ లేట్ అవుతున్న కారణంగా ముందు ఈ సినిమా చేస్తారని ఈ ప్రచారం సారాంశం. కానీ త్రివిక్రమ్ ముందు ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాను అని క్లారిటీ ఇచ్చేశాడు. 


తాజాగా అందుతున్న సమాచారం మేరకు రామ్ కూడా తన తదుపరి సినిమా సిద్ధం చేశాడు. ఈ ఏడాది సమ్మర్ లో రామ్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా ప్రారంభించనున్నాడట. నిజానికి అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ త్రీ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ తో తెరకెక్కే సినిమాని ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. 


అయితే ఎఫ్ త్రీ సినిమాని దసరా సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రామ్ సినిమాతో మళ్లీ సంక్రాంతి రేసులో నిలబడడానికి అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నారని అంటున్నారు. అనిల్ రావిపూడి చెప్పిన కథకు రామ్ కన్విన్స్ అయ్యాడు దీంతో రామ్ అనిల్ రావిపూడి కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది.. అయితే నిర్మాణం సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మిస్తారా లేక బయటి ప్రొడ్యూసర్స్ కి అవకాశం ఇస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: